లేటెస్ట్ : పవన్ మరో సినిమా బిగ్ అనౌన్సమెంట్ రెడీ.!

గాడ్ ఆఫ్ మాసెస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అయితే ఇప్పుడు తన అభిమానులకి మంచి కిక్ ని మళ్ళీ చాలా ఏళ్ల తర్వాత అందిస్తున్నాడని చెప్పాలి. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు అలాగే రాజకీయాల్లో కూడా మంచి బిజీగా కనిపిస్తూ పైగా రీమేక్ సినిమాలు పక్కన పెట్టి స్ట్రైట్ సినిమాలు ఓకే చేస్తుండడంతో పవన్ ఫ్యాన్స్ లో ఇప్పుడు ఉన్న ఆనందం అంతా ఇంత కూడా కాదు.

ఇక మొన్ననే యంగ్ దర్శకుడు సుజీత్ తో ఓజి – ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ అనే భారీ సినిమాని అనౌన్స్ చేయగా అది హైప్ ని ఇంకో లెవెల్ కి తీసుకెళ్లింది. ఇక ఈరోజు అయితే మరో భారీ అనౌన్సమెంట్ పై అప్డేట్ బయటకి వచ్చింది. ఇప్పుడు పవన్ సుజీత్ తో పాటుగా మరో దర్శకుడు హరీష్ శంకర్ తో ఓకే చేసిన సంగతి తెలిసిందే.

కాకపోతే ఇది భవదీయుడు భగత్ సింగ్ కాదు కొత్త సినిమా అని తక్కువ మందికే తెలుసు. మరి ఈ కొత్త సినిమాపై అయితే అతి త్వరలోనే మాస్ అప్డేట్ రాబోతున్నట్టుగా దర్శకుడు హరీష్ శంకర్ ఇప్పుడు కన్ఫర్మ్ చేస్తూ ట్వీట్ చేశారు. దీనితో ఈ ట్వీట్ వైరల్ గా మారింది.

ఇక దీనితో పాటుగా ఈ సినిమాకి కూడా దేవిశ్రీ ప్రసాద్ నే సంగీతం అలాగే మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ వారే చేస్తున్నట్టుగా హరీష్ కన్ఫర్మ్ చేసాడు. దీనితో ఈ కొత్త అనౌన్సమెంట్ తో పవన్ ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తున్నారు. 
https://twitter.com/harish2you/status/1600782845894889472