పవన్ కళ్యాణ్ సినిమాలు ఎలా.?

సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ త్వరలో జరగబోయే ఎన్నికలకు సమాయత్తమవుతున్నారు. మరి, సినిమాల సంగతేంటి.? ‘ఓజీ’ సినిమా రిలీజ్ డేట్ అయితే అనౌన్స్ అయిపోయింది.! ‘హరి హర వీరమల్లు’ సినిమాకి సంబంధించి వచ్చే నెలలో కీలక అప్డేట్ రాబోతోంది.

‘ఉస్తాద్ భగత్ సింగ్’ విషయమై కూడా అటు నిర్మాతలు, ఇటు హీరో, ఇంకో వైపు దర్శకుడు పూర్తి క్లారిటీతో వున్నారట. మరి, ఆయా సినిమాలు పూర్తయ్యేదెలా.? అంటే, ఎన్నికల తర్వాత పవన్ కళ్యాణ్, ఆయా సినిమాల షూటింగుల్లో బిజీ అవుతారన్నది ఇన్‌సైడ్ సోర్సెస్ నుంచి అందుతున్న సమాచారం.

ముందుగా ‘ఓజీ’ సినిమాని పవన్ కళ్యాణ్ పూర్తి చేస్తారట. ఎన్నికల ప్రచారం ముగిశాక, ఇన్ హౌస్ షూటింగ్ తరహాలో ఓజీ షూటింగ్ ప్రారంభమవుతుందట. అంటే, పూర్తిగా సెట్స్ వేసేసి, షూటింగుని కంప్లీట్ చేస్తారని అంటున్నారు.

మరోపక్క, అదే సమయంలో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా కూడా షూటింగ్ జరుపుకోనుందని సమాచారం. ఎన్నికల ప్రచారం ముగిసి, ఫలితాలు వచ్చేలోపు.. ఆ గ్యాప్‌లో పవన్ కళ్యాణ్ షూటింగులకు హాజరువుతారా.? లేదా.? అన్నదానిపై బిన్న వాదనలు వినిపిస్తున్నాయి.

వాస్తవానికి, ఎన్నికలకు ముందరే ‘ఓజీ’ పూర్తి చేయాలనుకున్నా, అనివార్య కారణాల వల్ల అది కుదరలేదు. మరోపక్క, ఈ మూడింటితోపాటు సైన్ చేసిన కొన్ని సినిమాల విషయంలో మాత్రం, పవన్ కళ్యాణ్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదట. దాదాపుగా ఆ ప్రాజెక్టులన్నీ పట్టాలెక్కకుండానే ఆగిపోయినట్లే భావించాలి. అందులో, సురేందర్ రెడ్డి ప్రాజెక్ట్ ఒకటి వుంది.