తప్పు చేశావ్ తారక్.! ఎన్టీయార్‌పై గుస్సా.!

ఆమె తొలిసారిగా తెలుగులో సినిమా చేసేందుకు సిద్ధమైంది. ఆమెను ఒప్పించడానికి దర్శక నిర్మాతలు నానా తంటాలు పడ్డారు. హీరో కూడా తనవైపు నుంచి మేగ్జామమ్ ట్రై చేశాడట.! రెమ్యునరేషన్ విషయంలో చాలా చాలా డిమాండ్లకు ‘ఊ’ కొట్టి మరీ ఆమెను ఒప్పించారట. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ గురించే ఇదంతా. ‘ఎన్టీయార్ 30’ సినిమా కోసం ఆమెను తీసుకొస్తున్న సంగతి తెలిసిందే. కొద్ది రోజుల క్రితమే ఫొటో సెషన్ నిర్వహించారు. వాటిల్లోంచి ఓ ఫొటోని సెలక్ట్ చేసి, జాన్వీ కపూర్ పుట్టినరోజు నాడు అప్‌డేట్ ఇచ్చారు.

ఇప్పుడిక అధికారికం. జాన్వీ కపూర్, ‘ఎన్టీయార్ 30’లో హీరోయిన్. ఇంతకీ, జూనియర్ ఎన్టీయార్ ఎక్కడ.? ‘ఆస్కార్’ వ్యవహారాల నిమిత్తం విదేశాలకు వెళ్ళాడు. వెళితే వెళ్ళాడుగానీ, టీమ్‌తో ట్వీట్ వేయించి వుండొచ్చుగా.. తన హ్యాండిల్ నుంచి.?

జాన్వీ కపూర్ అభిమానులు ఈ విషయమై తీవ్రంగా కలత చెందుతున్నారు. ‘ఎన్టీయార్‌తో కలిసి నటించాలని వుంది..’ అంటూ చాలా రోజులుగా జాన్వీ చెబుతూ వచ్చింది. మరి, ఆమెకి ఎన్టీయార్ ఇచ్చిన రెస్పెక్ట్ ఏంటి.? అన్న ప్రశ్నలు తెరపైకొస్తున్నాయి. జాన్వీ తండ్రి బోనీ కపూర్ కూడా ఈ విషయమై కొంత కలత చెందుతున్నాడట.