ఆకట్టుకుంటున్న ఆనంద్ దేవరకొండ హైవే కాన్సెప్ట్ పోస్టర్..!

దొరసాని సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆనంద్ దేవరకొండ ఇటీవల పుష్పక విమానం ద్వారా ప్రేక్షకులను సందడి చేశారు. ఈ క్రమంలోనే తాజాగా కె.వి.గుహన్ దర్శకత్వంలో ఆనంద్ దేవరకొండ మలయాళ ముద్దుగుమ్మ రాధాకృష్ణన్ హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం కానుంది. నార్త్ స్టార్ ఎంటర్ టైన్మెంట్ సమర్పణలో శ్రీ ఐశ్వర్య లక్ష్మి మూవీస్ పతాకంపై ప్రొడక్షన్ నెంబర్ 2 గా వెంకట్ తలారి ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఇదిలా ఉండగా తాజాగా హైవే సినిమా నుంచి కాన్సెప్ట్ పోస్టర్ విడుదల చేయడంతో ఈ పోస్టర్ విపరీతంగా ప్రేక్షకులను ఆకట్టుకుంది.

తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక సరిహద్దు ప్రాంతాలలో అద్భుతమైన లొకేషన్లలో ఈ సినిమా చిత్రీకరణ జరుపుకునే. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ఈ సినిమా నుంచి కాన్సెప్ట్ పోస్టర్ విడుదల చేయడంతో ఈ పోస్టర్ వైరల్ గా మారి సినిమాపై అంచనాలను పెంచింది. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు అభిషేక్ బెనర్జీ, బాలీవుడ్ బ్యూటీ సయామీ ఖేర్ కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాత వెంకట్ తలారి మాట్లాడుతూ..118 చిత్రాన్ని తెరకెక్కించిన గుహన్ ఈ చిత్రాన్ని ఎంతో అద్భుతంగా తెరకెక్కించారు.

ఆనంద్ దేవరకొండ మానస రాధాకృష్ణన్ ఇంత అద్భుతంగా నటించారని మా బ్యానర్ లో తెరకెక్కిన ఈ సినిమా విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడారు. ఇక దర్శకుడు మాట్లాడుతూ ఒకరితో ఒకరికి సంబంధం లేకుండా నలుగురితో ఈ కథ సాగుతుందని, సినిమా పూర్తిగా హైవే నేపథ్యంలో సాగుతూ సీట్ ఎడ్జ్ థ్రిల్లర్ ఈ సినిమా ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుందని ఈ సందర్భంగా వెల్లడించారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ సినిమాకి సైమన్ కే కింగ్ సంగీతం అందించారు.