భారతీయుడు 2 కోసం కమల్ హాసన్ తీసుకుంటున్న రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

దక్షిణాది సినీ ఇండస్ట్రీలో అగ్ర హీరోగా ఎంతో మంచి పేరుప్రఖ్యాతలు సంపాదించుకున్న నటుడు లెజెండరీ యాక్టర్ కమల్ హాసన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈయన శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన భారతీయుడు సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి అప్పట్లో ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్నారు.లైకా ప్రొడక్షన్స్ నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకోవడంతో ఈ సినిమాకి సీక్వెల్ చిత్రం చేయాలని ప్లాన్ చేశారు. ఈ క్రమంలోనే ఈ సినిమా సీక్వెల్ చిత్రాన్ని ప్రారంభించగా కొన్ని కారణాలవల్ల ఈ సినిమా మధ్యలోనే ఆగిపోయింది.

అయితే తిరిగి ఈ సినిమా షూటింగ్ పనులను లైకా ప్రొడక్షన్స్ ప్రారంభించారు.ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ పనులను జరుపుకుంటుంది. ఈ సినిమాలో నటి కాజల్ అగర్వాల్ అలాగే రకుల్ ప్రీతిసింగ్ నటిస్తున్నారు. ఇకపోతే ఈ సినిమా కోసం కమల్ హాసన్ తీసుకున్న రెమ్యూనరేషన్ గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా కోసం కమల్ హాసన్ ఇప్పటివరకు కోలీవుడ్ ఇండస్ట్రీలో ఏ హీరో కూడా తీసుకొని అంత రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారని తెలుస్తోంది.

విక్రమ్ సినిమాతో ఎంతో మంచి విజయం అందుకున్న కమల్ హాసన్ భారతీయుడు సినిమా కోసం ఏకంగా 150 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్టు సమాచారం.కేవలం కోలీవుడ్ ఇండస్ట్రీలోనే కాకుండా సౌత్ ఇండస్ట్రీలోనే ఇంతటి రెమ్యూనరేషన్ ఏ హీరో తీసుకోలేదని చెప్పాలి. ఇలా 150 కోట్ల రెమ్యూనరేషన్ అంటే మామూలు విషయం కాదు.ఏది ఏమైనా కమల్ హాసన్ ఈ సినిమా కోసం తీసుకున్న రెమ్యూనరేషన్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. అయితే ఈ విషయంలో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.