(చిత్రం: భారతీయుడు 2, విడుదల తేదీ : జూలై 12, 2024, రేటింగ్: రేటింగ్ : 2.75/5 , తారాగణం: కమల్‌హాసన్, సిద్ధార్థ్, రకుల్‌ప్రీత్‌సింగ్, ప్రియా భవానీ శంకర్, నెడుముడి వేణు, బాబీ సింహ, సముద్రఖని, వివేక్, కాళిదాస్ జయరాం తదితరులు .. సినిమాటోగ్రఫీ: రవివర్మన్, సంగీతం: అనిరుధ్ రవిచంద్రన్, నిర్మాణ సంస్థ: లైకా ప్రొడక్షన్స్, రెడ్‌జాయింట్, నిర్మాత: సుభాస్కరన్, దర్శకత్వం: శంకర్)
వ్యవస్థలో పేరుకుపోయిన అవినీతిపై స్వాతంత్య్ర సమరయోధుడు సేవాపతి సాగించిన పోరాటం నేఫథ్యంలో కమల్ హాసన్ హీరోగా 1996లో వచ్చిన భారతీయుడు’ చిత్రం అప్పట్లో పెద్ద సంచలనం సృష్టించింది. ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంది. భారీ నిర్మాణ విలువలు, కమల్‌హాసన్ ద్విపాత్రాభినయం, ఏ.ఆర్.రెహమాన్ సంగీతం ప్రధానాకర్షణలుగా బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించింది. ఫలితంగా ఇప్పుడు వచ్చిన ‘భారతీయుడు-2’ సినిమాపై భారీ హైప్ క్రియేట్ అయింది. ఈ చిత్రం నేడు (జూలై 12,2024)న భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి ఈ సినిమా ఎలావుందో తెలుసుకుందాం.
కథ : చిత్ర అరవిందన్ (సిద్ధార్థ్)కు సామాజిక స్పృహ ఎక్కువ. సొంతంగా యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తూ సమాజంలో జరుగుతున్న అవినీతి ఘటనలను ప్రజలకు తెలియజేస్తూ వారిని చైతన్యపరుస్తుంటాడు. ఉద్యోగం కోసం ఓ మహిళ ఆత్మహత్య చేసుకున్న సంఘటన అతన్ని కలవరపరుస్తుంది. అందుకు కారకులైన వారిని శిక్షించాలంటూ అరవిందన్ చేసే పోరాటం ఫలించదు. దీంతో తీవ్ర నిరాశకు లోనైన అతను ‘భారతీయుడు’ మళ్లీ రావాలంటూ సోషల్‌మీడియా ద్వారా విస్త్రతంగా ప్రచారం చేస్తాడు. ఈ నేపథ్యంలో తైవాన్ రాజధాని తైపీలో ఉంటున్న భారతీయుడు (సేవాపతి) ఇండియాకు తిరిగొస్తాడు. భారీ స్థాయిలో అవినీతికి పాల్పడుతున్న కొందరు బడా బాబులను అంతమొందిస్తాడు. అదే క్రమంలో అవినీతికి వ్యతిరేకంగా యువతలో చైతన్యం నింపుతూ రహస్యంగా తన కార్యకలాపాలను నిర్వహిస్తుంటాడు. ఈ నేపథ్యంలో యాంటీ కరప్షన్ బ్యూరోలో పనిచేస్తున్న అరవిందన్ తండ్రి (సముద్రఖని) సైతం అవినీతి ఆరోపణలతో అరెస్ట్ అవుతాడు. దీంతో మనస్తాపానికి గురైన అతని భార్య ఆత్మహత్య చేసుకుంటుంది. తన కుటుంబంలో ఇంతటి విషాదానికి కారణం సేనాపతియేనని అరవిందన్ అతనిపై కోపం పెంచుకుంటాడు. ఇండియన్ గోబ్యాక్ అంటూ ప్రచారాన్ని ప్రారంభిస్తాడు? ఈ క్రమంలో ఏం జరిగింది? అవినీతిని అంతమొందిస్తానని తిరిగొచ్చిన సేనాపతిపై సామాన్య ప్రజలు కూడా తిరగబడటానికి కారణాలేమిటి? భారతీయుడి అసలు లక్ష్యం ఏమిటి? అన్నదే సినిమా కథ.
విశ్లేషణ: సమకాలీన సమాజంలో పేరుకుపోయిన అవినీతి, అన్యాయాలను ఆలోచనాత్మకంగా ఎస్టాబ్లిష్ చేస్తూ సాగిన ఈ సినిమాలో భారీ తారాగణంతో పాటు అద్భుతమైన విజువల్స్ మరియు భారీ యాక్షన్ ఎపిసోడ్స్ వంటి అంశాలు సినిమాకి స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచాయి. దేశంలోని అవినీతి రాజకీయ నాయకులను, అలాగే అధికారుల అక్రమాలను బహిర్గతం చేస్తూ సాగే కార్టూన్ ట్రాక్ సినిమాలో హైలైట్ గా ఉంది. మొత్తానికి భారీ విజువల్స్ తో పాటు గుడ్ ఎమోషన్స్ కూడా బాగా చూపించారు. ముఖ్యంగా సమాజంలోని లోటుపాట్లును దర్శకుడు శంకర్ చాలా బాగా చూపించారు. చివర్లో మూడో పార్ట్ కి సంబంధించి రివీల్ చేసిన షాట్స్ కూడా బాగున్నాయి. అవినీతికి వ్యతిరేకంగా పోరాడే వృద్ధ స్వాతంత్ర్య సమరయోధుడి కథ గురించి ఆల్ రెడీ భారతీయుడు చిత్రంలోనే చాలా బాగా చూపించారు. దీంతో ఈ సీక్వెల్ లో ప్లాట్ పరంగా, పాత్రల పరంగా ఫ్రెష్ నెస్ మిస్ అయ్యింది. సమకాలీన సంఘటనల ఆధారంగా సీన్స్ రాసుకున్నప్పటికీ, వాటిలో ఎలాంటి కొత్తదనం లేదు. దీంతో స్క్రీన్ ప్లే చాలా రెగ్యులర్ గా సాగుతున్న ఫీలింగ్ కలుగుతుంది. అదే విధంగా కొన్ని సన్నివేశాలు బోర్ గా సాగాయి. పైగా దేశంలోని అవినీతి రాజకీయ నాయకులను బహిర్గతం చేయడానికి చాలా సీన్స్ ను ఎస్టాబ్లిష్ చేశారు. ఆ అవినీతి గురించి అవగాహన ఉన్నదే కదా. ఆ అవినీతి పై భారతీయుడు ఏం చేస్తాడు అనేదే ఆసక్తికరంగా ఉంటుంది. కానీ, ఆ కోణంలో ఈ సినిమా ఎక్కువ సేపు సాగకపోవడం కొంత నిరాశను కలిగిస్తోంది. పైగా కమల్ హాసన్ తో పాటు ఈ మూవీలో సిద్ధార్థ్ క్యారెక్టర్ కి కూడా లెంగ్త్ ఎక్కువగా ఉండటం ఫ్యాన్స్ కి రుచించదు. అనిరుధ్ మ్యూజిక్ కూడా గొప్పగా సాగలేదు. మొత్తానికి ఈ సినిమా కొన్నిచోట్ల బోరింగ్ ప్లేతో, అవుట్ డేటెడ్ సీన్స్ తో సాగింది . తొలిభాగంలో మాదిరిగానే ఈ సినిమాలో కూడా అవినీతి సమస్యపైనే దర్శకుడు ప్రధానంగా దృష్టిపెట్టారు. నాటికి, నేటికి వ్యవస్థలో ఎలాంటి మార్పులు జరగకపోగా అవినీతి మరింత వ్యవస్థీకృతం కావడంతో సేనాపతి సరికొత్త మిషన్‌తో దేశంలో అడుగుపెడతాడు. దేశంలోని అవినీతి ఘటనలు, ఉద్యోగ నియామకాల్లో జరుగుతున్న అక్రమాలను చూపిస్తూ కథను ఆరంభించిన విధానం ఆకట్టుకుంటుంది. అయితే ఇవే తరహా సంఘటనలను ‘భారతీయుడు’ చిత్రంలో చూసి ఉండటంతో స్క్రీన్‌ప్లేలో ఏ మాత్రం కొత్తదనం కనిపించదు. సమకాలీన సమస్యలను చర్చించినప్పటికీ వాటిని ఆవిష్కరించిన విధానం మాత్రం రొటీన్‌గా అనిపిస్తుంది.
సినిమా అసాంతం సేనాపతి అవినీతికి పాల్పడ్డ రాజకీయనాయకులు, బడా వ్యాపారవేత్తను టార్గెట్ చేస్తూ వారిని తనదైన పద్దతిలో అంతం చేస్తుంటాడు. తొలి భాగం మొత్తం ఆ ఎపిసోడ్స్‌తోనే కథను నడిపించాడు దర్శకుడు శంకర్. ఎక్కువగా సంభాషణల ద్వారా సేనాపతి తన అవినీతి నిర్మూలన అజెండా గురించి ప్రజలకు చెబుతుంటాడు. కాంటెంపరరీ టైమ్స్‌లో అవినీతి ఏ స్థాయిలో ఉందో చెప్పడానికి దర్శకుడు శంకర్ చేసిన ప్రయత్నం బాగానే ఉందనిపించినా.. ఆ సన్నివేశాలను తీర్చిదిద్దిన విధానం కొత్తగా అనిపించదు. ఇక ఈ సినిమాలో కూడా శంకర్ తనదైన స్థాయి భారీ నిర్మాణ హంగులు, అద్భుతమైన విజువల్స్‌తో ప్రేక్షకుల్ని మెప్పించే ప్రయత్నం చేశారు. తైపీలో సేనాపతి అరంగేట్ర సన్నివేశాలను చూపించిన విధానం బాగుంది. ప్రీైక్లెమాక్స్ ఘట్టాల్లో కథ మలుపులు తీసుకోవడంతో అక్కడి నుంచి సన్నివేశాలన్నీ ఆసక్తికరంగా మారుతాయి. కమల్‌హాసన్‌పై చిత్రీకరించిన భారీ యాక్షన్ ఎపిసోడ్స్ హైలైట్‌గా నిలిచాయి. కమల్‌హాసన్ లుక్స్, మ్యానరిజమ్స్ కూడా ప్రేక్షకుల్ని మెప్పిస్తాయి. ైక్లెమాక్స్‌లో వచ్చే ట్విస్ట్ మూడో భాగంపై ఆసక్తిని పెంచేలా ఉంది. కథలో అక్కడక్కడా మంచి ఎమోషన్స్ పండాయి. దేశంలో అవినీతి ఎంత వ్యవస్థీకృతమైపోయిందో, దానిని నిర్మూలించడానికి ఎలాంటి కార్యచరణ అవసరమో అనే అంశాలను దర్శకుడు శంకర్ తనదైన పంథాలో ఆవిష్కరించే ప్రయత్నం చేశాడు.
ఎవరెలా చేశారంటే…. కమల్‌హాసన్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సేనాపతి పాత్రలో మరోసారి తెరపై మ్యాజిక్ చేశారు. తనదైన నటనతో వన్‌మ్యాన్‌షోగా నిలిచారు. కమల్ లుక్ అండ్ మ్యానరిజమ్స్‌తో పాటు ఆయనపై వచ్చే యాక్షన్ ఎపిసోడ్స్ కూడా చాలా బాగున్నాయి. అలాగే బ్రేకింగ్ డాగ్స్ అంటూ సాగిన యానిమేషన్ విజువల్స్ కూడా బాగున్నాయి. మొత్తానికి విజువల్ గా ఈ చిత్రం చాలా గ్రాండియర్‌గా ఉంది. చిత్ర అరవిందన్ పాత్రలో సిద్ధార్థ్ ఒదిగిపోయాడు. పైగా సిద్దార్థ్ కి స్క్రీన్ టైమ్ కూడా ఎక్కువగానే ఉంది. సకలకళ వల్లవన్ సర్గుణ పాండియన్‌గా ఎస్.జె సూర్య తన పాత్రకు ప్రాణం పోశారు. సిబిఐ ప్రమోద్‌గా బాబీ సింహా ఆకట్టుకున్నాడు. దిశా పాత్రలో రకుల్ ప్రీత్ సింగ్ కూడా మెప్పించింది. నటి ప్రియా భవానీ శంకర్ తన పాత్రలో మెరిశారు. మరో కీలక పాత్రలో సముద్రఖని కూడా చాలా బాగా నటించాడు. అలాగే, వివేక్, గుల్షన్ గ్రోవర్ లతో పాటు మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.
సాంకేతికంగా.. సినిమాలో సాంకేతిక విభాగం వర్క్ చాలా బాగుంది. అనిరుధ్ రవిచందర్ సంగీతం సినిమాకు ప్లస్ కాలేదు. రవి వర్మన్ సినిమాటోగ్రఫీ మాత్రం సినిమాకే హైలెట్ గా నిలుస్తోంది. కొన్ని కీలక సన్నివేశాల్లో కెమెరామెన్ పనితనం చాలా బాగుంది. ఎడిటర్ ఎ. శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ బాగుంది. సినిమాలోని నిర్మాతలు సుభాస్కరన్ అల్లిరాజా, ఉదయనిధి స్టాలిన్ పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ అద్భుతంగా ఉన్నాయి దర్శకుడు ఎస్. శంకర్ దర్శకత్వ పరంగా మాత్రం చాలా బాగా ఆకట్టుకున్నారు. రచన పరంగా మాత్రం ఆకట్టుకోలేకపోయారు. భారీ అంచనాల మధ్యన వచ్చిన ఈ ‘భారతీయుడు-2’ కమల్ అభిమానులను మాత్రం ఆకట్టుకుంది. అలాగే, శంకర్ మార్క్ విజువల్స్, కమల్ హాసన్ నటన సినిమాకి ప్లస్ అయ్యాయి. అయితే, బోరింగ్ ప్లే, అవుట్ డేటెడ్ సీన్స్ అండ్ పెద్దగా కథ లేకపోవడం, మరియు కొన్ని సన్నివేశాలు రెగ్యులర్ గా సాగడం వంటి అంశాలు సినిమాకి మైనస్ పాయింట్స్ గా నిలిచాయి. దర్శకుడు శంకర్ తనదైన శైలి గ్రాండియర్‌తో సినిమాను తెరకెక్కించాడు. అయితే కథలోని ఎమోషన్‌పై మరింత దృష్టిపెడితే బాగుండేది.