తొలిసారి జీవితంలో అలా నటించాను…. నటుడు శ్రీకాంత్ కామెంట్స్ వైరల్!

తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోగా ఎంత పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న వారిలో సీనియర్ నటుడు శ్రీకాంత్ ఒకరు.ఈయన హీరోగా సుమారు 120 సినిమాలుకు పైగా నటించారు. అయితే ప్రస్తుతం తన సెకండ్ ఇన్నింగ్స్ లో మాత్రం హీరోలకు అన్నయ్య పాత్రలలో లేదా బాబాయ్ పాత్రల ద్వారా నటిస్తూ సందడి చేస్తున్నారు. ఈ క్రమంలోనే విజయ్ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన వారసుడు సినిమా ద్వారా మరోసారి శ్రీకాంత్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

ఈ సినిమా జనవరి 12వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి శ్రీకాంత్ ఈ సినిమాలో తాను విజయ్ కి అన్నయ్య పాత్రలో నటించానని మొదటి నుంచి చివరి వరకు నా పాత్ర చాలా కీలకంగా ఉంటుందని తెలిపారు.ఇకపోతే మొదటిసారి తాను స్టార్ హీరో విజయ్ తో కలిసి తమిళ సినిమాలు నటించానని శ్రీకాంత్ ఈ సందర్భంగా తెలియజేశారు.

ఈ సినిమాని వంశీ పైడిపల్లి ఎంతో అద్భుతంగా తెరకెక్కించారు. పక్క ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రంగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తప్పకుండా ఈ సినిమా ప్రతి ఒక్కరికి నచ్చుతుందని శ్రీకాంత్ తెలిపారు. ఇక తాను నటుడు విజయ్ ను పలు సార్లు కలిసినప్పటికీ ఆయనతో కలిసి నటించడం ఇదే తొలిసారి అని శ్రీకాంత్ తెలిపారు ఇక ఆయన సెట్ లో ఎప్పుడు ఎక్కువగా మాట్లాడరు అలాగే సెట్ లోకి వచ్చిన తర్వాత ప్యాకప్ చెప్పే వరకు ఎక్కడికి వెళ్లరని కనీసం క్యారవాన్ కూడా ఉపయోగించరని శ్రీకాంత్ తెలిపారు.