టాలీవుడ్ యంగ్ హీరో నితిన్‌కు ప్రమాదం జరిగినట్లు వార్తలు వచ్చాయి. నితిన్ ప్రస్తుతం వేణు శ్రీరామ్ డైరెక్షన్‌లో తమ్ముడు అనే సినిమా చేస్తుండగా.. దిల్ రాజు ఈ మూవీని నిర్మిస్తున్నాడు. ఇటీవలే ఈ మూవీ ప్రారంభంకాగా.. షూటింగ్ కోసం మారేడుమిల్లి అడవులకు వెళ్లారు. షూటింగ్‌లో భాగంగా భారీ యాక్షన్ సన్నీ వేశాలు జరుగుతున్న సమయంలో నితిన్‌కు గాయాలు అయినట్లు వార్తలు సోషల్ విూడియాలో వైరల్ అయ్యాయి.
అయితే ఈ వార్తలపై.. నితిన్ టీమ్ తాజాగా స్పందించింది. నితిన్ గాయపడినట్లు వస్తున్న వార్తలు అబద్దమని వాటిలో నిజం లేదని తెలిపాయి. నితిన్ ప్రస్తుతం భుజం నొప్పితో బాధపడుతున్నాడని ఈ కారణంగానే కొన్ని రోజులు షూటింగ్‌కు బ్రేక్ ఇచ్చాడని తెలిపింది.
భుజం నొప్పి కారణంగా ప్రస్తుతం ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నాడని వెల్లడిరచింది. తమ్ముడు సినిమాలో నటిస్తున్న నితిన్ ప్రస్తుతం ఒక మంచి కమ్‌బ్యాక్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఆయన చివరిగా నటించిన ’ఎక్స్‌ట్రా.. ఆర్డినరీ మ్యాన్’, మాచర్ల నియోజక వర్గం సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్‌లు అందుకున్న విషయం తెలసిందే. దీంతో తన ఆశలన్నీ ’తమ్ముడి’ పైనే పెట్టుకున్నాడు.