Yellamma: సినిమా ఇండస్ట్రీలో నటీనటుల విజయాలే వారి ప్రయాణాని డిసైడ్ చేస్తాయన్న విషయం తెలిసిందే. సినిమా సక్సెస్ లు, ఫ్లాప్ లు వారికీ అవకాశాలను తెచ్చి పెడతాయి. ఎన్ని హిట్స్ పడితే అంత ఎక్కువ కాలం ఫీల్డ్ లో ఉంటారు. ఫెయిల్యూర్స్ వచ్చాయంటే వచ్చిన అవకాశాలు కూడా వెనక్కి వెళ్లిపోతాయి. అయితే ప్రస్తుతం టాలీవుడ్ హీరో నితిన్ పరిస్థితి అలాగే ఉంది. ఈమధ్య కాలంలో హీరో నితిన్ నటించిన సినిమాలు ఏవి కూడా బాక్స్ ఆఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో సక్సెస్ అవ్వడం లేదు. వరుసగా డిజాస్టర్ల మీద డిజాస్టర్లు ఇస్తూ వస్తున్నాడు నితిన్.
ఈమధ్య విడుదల అయిన రాబిన్ హుడ్, తమ్ముడు సినిమాలు సైతం భారీ డిజాస్టర్స్ గా నిలిచాయి. దాంతో కనీసం తన నెక్స్ట్ సినిమాతో అయినా నితిన్ సక్సెస్ ని అందుకుంటాడా లేదా అని సందేహ పడుతున్నారు ఫ్యాన్స్. కానీ ఇప్పుడు ఆ అవకాశం కూడా లేకుండా పోయింది. ఎందుకంటే ఆ సినిమా నుంచి ఆయన్ని తీశేశారు కాబట్టి. అవును నితిన్ తన నెక్స్ట్ సినిమాగా ఎల్లమ్మ సినిమా చేయాలి. బలగం లాంటి బ్లాక్ బస్టర్ సినిమా తరువాత వేణు ఎల్దండి చేస్తున్న సినిమా కావడంతో ఎల్లమ్మ మూవీపై ప్రేక్షకుల్లో భారీగానే అంచనాలు నెలకొన్నాయి. అదే రేంజ్ లో కథను కూడా సిద్ధం చేసుకున్నాడు వేణు. ఈ సినిమాలో తెలంగాణ హీరో అయితే బాగుంటుందని భావించిన టీం హీరోగా నితిన్ ని ఫిక్స్ చేశారు.
ఇక రేపోమాపో షూటింగ్ కూడా మొదలవుతుంది అనుకున్నారు. కానీ ఊహించని విధంగా ఈ సినిమా నుంచి హీరో నితిన్ ని తొలగించారట మూవీ మేకర్స్. అయితే అందుకు కారణం రీసెంట్ గా ఆయన వరుస ప్లాప్ లలో ఉండటమే అని తెలుస్తోంది. దాంతో ప్రేక్షకులలో కాస్త నెగిటీవ్ ఇంపాక్ట్ పడింది. ఆ ఇంపాక్ట్ ఎల్లమ్మ సినిమాపై పడకూడదని టీం ఈ డెసిషన్ తీసుకున్నారట. అయితే నితిన్ స్థానంలో బెల్లంకొండ శ్రీనివాస్ ని తీసుకోబోతున్నారట. బెల్లంకొండ రీసెంట్ గా కిష్కిందపురి సినిమాతో సూపర్ హిట్ ని అందుకున్నాడు. దాంతో బెల్లంకొండ శ్రీనివాస్ అయితే ఈ పాత్రకు పర్ఫెక్ట్ ఫా సెట్ అవుతాడని టీం భావిస్తున్నారట. త్వరలోనే ఈ విషయం గురించి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని టాక్.
Yellamma: ఎల్లమ్మ మూవీ నుంచి హీరో నితిన్ అవుట్.. రంగంలోకి ఆ హీరో!
