మెగాస్టారూ.! రీమేకూ.! యస్ చెప్పమాకూ.!

ఆల్రెడీ మెగాస్టార్ చిరంజీవి ‘వేదాళం’ రీమేక్‌లో నటిస్తున్న సంగతి తెలిసిందే. అదే ‘భోళా శంకర్’ మూవీ. ఇక, ఇప్పుడు మరో రీమేక్ గురించి చర్చ జరుగుతోంది. అయితే, ఇకపై రీమేకులు వద్దు.. అంటూ చిరంజీవికి ఫ్యాన్స్‌తో పాటూ, సన్నిహితులు కూడా సలహాలిస్తున్నారట.

అయితే, చిరంజీవికి కూడా ఆ వుద్దేశ్యం లేదని తెలుస్తోంది. ఇప్పటికే బ్యాక్ టు బ్యాక్ రెండు స్ర్టెయిట్ సినిమాలు రెడీ చేసి పెట్టేశారాయన. రేపో మాపో వాటి అనౌన్స్‌మెంట్లు రానున్నాయ్.

అయితే, వాటితో పాటూ, ఓ రీమేక్ సినిమా కూడా చేసే యోచనలో చిరంజీవి వున్నట్లు ఇన్‌సైడ్ సోర్సెస్ ద్వారా అందుతోన్న సమాచారం. ‘బ్రోడాడీ’ అనే మలయాళ రీమేక్‌పై గత కొన్నాళ్లుగా చర్చ జరుగుతోంది. తాజాగా ఈ సినిమా రైట్స్‌ని చిరంజీవి పెద్ద కుమారై సుస్మిత కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.

సో, ఈ రీమేక్ అయితే దాదాపు కన్‌ఫామ్ అయినట్లే. ఇది కాక ఇంకో రీమేక్ కోసం చిరు ప్లాన్ చేస్తున్నారా.? తెలియాల్సి వుంది.