గుండెపోటుతో మృతి చెందిన సల్మాన్ ఖాన్ డూప్… వైరల్ అవుతున్న సల్మాన్ ఖాన్ పోస్ట్..?

సాధారణంగా సినిమాలలో హీరోలు ఎంతో కష్టపడి ఫైటింగ్స్ చేస్తూ ఉంటారు. కానీ కొన్ని సన్నివేశాలలో మాత్రం హీరోలు రిస్క్ తీసుకోకుండా వారి కోసం ఒక డూప్ ని పెట్టుకుంటారు. ఇలా బాలీవుడ్ ఇండస్ట్రీలో చాలామంది స్టార్ హీరోలు డూప్ ని పెట్టుకుంటారు. అలాగే బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కి కూడా సాగర్ పాండే అనే వ్యక్తి ఎన్నో సినిమాలో డూప్ గా నటించాడు.

అచ్చం సల్మాన్ ఖాన్ పోలికలతో ఉన్న సాగర్ పాండే ‘ట్యూబ్‌లైట్’, ‘ దబంగ్, దబంగ్ 2 ,ప్రేమ్ రతన్ ధన్ పాయో, బజరంగీ భాయిజాన్’ వంటి సినిమాలలో సల్మాన్ ఖాన్ తో కలసి నటించాడు. ఈ సినిమాలలో యాక్షన్ సన్నివేశాలలో సల్మాన్ ఖాన్ కి డూప్ గా నటించాడు. ఇదిలా ఉండగా ఇటీవల జిమ్ లో వ్యాయామాలు చేస్తున్న సాగర్ పాండే గుండెపోటుతో మరణించాడు. దీంతో బాలీవుడ్ ఇండస్ట్రీ లో ఉన్న పలువురు సినీ ప్రముఖులు అతనికి సంతాపం తెలిపారు.

ఇక సల్మాన్ ఖాన్ కూడా సోషల్ మీడియా వేదికగా సాగర్ పాండే కి సంతాపం తెలియజేశాడు. ఈ క్రమంలో అతనితో కలిసి దిగిన ఫోటోని సల్మాన్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. నాతో కలసి ప్రయాణం చేసినందుకు మీకు ధన్యవాదాలు. మీ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను అంటూ సల్మాన్ ఖాన్ ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.