మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ మహానటి సినిమాలో జెమినీ గణేషన్ పాత్ర ద్వారా సందడి చేశారు. ఈ సినిమాలో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈయన అనంతరం హను రాఘవపూడి దర్శకత్వంలో సీతారామం సినిమా ద్వారా పూర్తిస్థాయి తెలుగు సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.అందమైన ప్రేమ కథ చిత్రంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా కేవలం తెలుగు భాషలోనే కాకుండా ఇతర భాషలలో కూడా ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమా మంచి విజయం సాధించడంతో దుల్కర్ సల్మాన్ కి తెలుగులో మరిన్ని అవకాశాలు వస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలోనే ఈయన తాజాగా మరో తెలుగు సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఈయన తన తదుపరి సినిమాని ప్రముఖ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో చేయనున్నట్లు తెలుస్తుంది. అయితే ప్రస్తుతం శేఖర్ కమ్ముల హీరో ధనుష్ తో సినిమా చేస్తున్నట్లు ప్రకటించారు. కానీ ఈ సినిమా షూటింగ్ పనులను ప్రారంభించడానికి మరి కాస్త ఆలస్యం కానుంది. అందుకు గల కారణం ప్రస్తుతం ధనుష్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో సర్ అనే సినిమాతో బిజీగా ఉన్నారు.
ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ పనులు జరుపుకుంటుంది.ఈ సినిమా అనంతరం ధనుష్ శేఖర్ కమ్ముల సినిమాతో బిజీ కానున్నారు. ఇక ఈ మధ్యలో చాలా గ్యాప్ ఉండడం చేత శేఖర్ కమ్ముల దుల్కర్ సల్మాన్ తో సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే శేఖర్ కమ్ముల అద్భుతమైన కథను సిద్ధం చేసి దుల్కర్ సల్మాన్ కు వినిపించినట్లు సమాచారం. ఈ సినిమా కథ విన్న దుల్కర్ ఈ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తుంది. ఇక ఈ విషయంలో ఎంతవరకు నిజముందో తెలియాల్సి వుంది.