‘పుష్ప-2’ ఎప్పడోస్తుందో తెలుసా…?

టాలీవుడ్‌లో రాబోతున్న మోస్ట్‌ అవెయిటెడ్‌ సినిమాల్లో ఒకటి ‘పుష్ప.. ది రూల్‌’. సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కి బ్లాక్‌ బస్టర్‌ హిట్‌గా నిలిచిన ‘పుష్ప.. ది రైజ్‌’కు సీక్వెల్‌గా వస్తున్న ఈ మూవీలో ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ పుష్పరాజ్‌గా మరోసారి ఎంటర్‌టైన్‌ చేసేందుకు రెడీ అవుతున్నాడు.

ఈ సినిమాని ఇండిపెండెన్స్‌ డే సందర్భంగా ఆగస్టు 15న విడుదల చేస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించేశారు మేకర్స్‌. ఈ సందర్భంగా పుష్ప రాజ్‌ తన రూల్‌ను ప్రారంభించడానికి ఇంకా 200 రోజులు మిగిలి ఉందంటూ మేకర్స్‌ కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు.

ఇక ఈ పోస్టర్‌లో ఒక కొండపై పులి కనిపిస్తున్నట్లు ఉంది. కాగా ప్రస్తుతం ఈ పోస్టర్‌ నెట్టింట వైరల్‌గా మారింది.’పష్ప.. ది రూల్‌’ కోసం రాక్‌ స్టార్‌ దేవీ శ్రీ ప్రసాద్‌ నుంచి ఫస్ట్‌ పార్టును మించిపోయే మరో చార్ట్‌ బస్టర్‌ ఆల్బమ్‌ రాబోతుందని ఇన్‌సైడ్‌ టాక్‌. ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌ భారీ బ్జడెట్‌తో తెరకెక్కిస్తోంది. ఫస్ట్‌ పార్టులో శ్రీవల్లిగా నటించిన కన్నడ సోయగం రష్మిక మందన్నా సీక్వెల్‌లో మరోసారి ఫీ మేల్‌ లీడ్‌ రోల్‌లో కనిపించనుంది.