Chiranjeevi : మల్టీ స్టార్రర్ సినిమాల పై మోజు పడుతున్న చిరు….!

Chiranjeevi : మెగాస్టార్ చిరు వరుస సినిమాలతో అభిమానులను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు. ప్రస్తుతం ఆచార్య సినిమా పూర్తి అయి ఏప్రిల్ 29న విడుదలకు సిద్ధమైంది. ఈ సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహించారు. ఇక ఈ సినిమాలో చిరంజీవి తో పాటుగా తనయుడు రామ్ చరణ్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇక గాడ్ ఫాదర్ సినిమా షూటింగ్ కుడా శరవేగంగా జరుపుకుంటోంది. ఈ సినిమా మలయాళం సినిమా లూసిఫర్ సినిమాకు రీమేక్. ఇక ఈ సినిమాలో చిరు తో పాటు మరో ముఖ్య పాత్రలో సల్మాన్ ఖాన్ నటిస్తున్నాడు.

ఇక చిరు నటిస్తున్న బాబీ దర్శకత్వంలోని సినిమాకూడా సెట్స్ పైకి వచ్చింది. ఇక ఈ సినిమాలో కూడా చిరంజీవి తో పాటు మరో కీలక పాత్రలో రవితేజ నటిస్తున్నాడు. చాలా ఏళ్ల తరువాత రవితేజ, చిరు తో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాడు. ఇక చిరంజీవి వేదళం తమిళ రీమేక్ భోళా శంకర్ ను కూడా పట్టాలెక్కించాడు. ఈ సినిమా ప్రధానంగా అన్న చెల్లెలి ఎమోషన్ ఆధారంగా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో కీర్తి సురేష్ చెల్లెలి గా నటిస్తోంది.

ఇటీవలే ఛలో సినిమా ఫేమ్ వెంకీ కుడుముల దర్శకత్వంలో ఒక సినిమాకు చిరు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. ఈ సినిమా ఒక సందేశాత్మక చిత్రమ్ అయితే ఈ సినిమాలో సమాజంలో ఉన్న ఒక సమస్యను కమర్షియల్ ఎలిమెంట్స్ తో తెరాకెక్కిస్తున్నారు.ఇక ఈ సినిమాలో చిరు తో పాటు మరో హీరో పాత్రకి అవకాశం ఉందట. ఈ పాత్ర కోసం హీరో వేటలో ఉన్నారట ఇక హీరో నితిన్ ను అనుకుంటున్నారట దర్శకుడు వెంకీ. అయితే ఇంకా ఫైనల్ చేయలేదు. ఎలా చిరు ఒక్క భోళా శంకర్ మినహాయిస్తే అన్ని సినిమాల్లోను మరో హీరోతో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు.