ప్చ్..ఓటిటి సెన్సేషన్ ని వదిలేసి తప్పు చేసిన మెగాస్టార్?

తెలుగు సినిమా దగ్గర ఉన్న దిగ్గజ హీరోస్ లో మెగాస్టార్ కోసం కానీ తన సినిమాల బాక్సాఫీస్ పెర్ఫామెన్స్ కోసం కానీ అందరికీ తెలిసిందే. ఇక రీసెంట్ గా వచ్చిన వాల్తేరు వీరయ్య ఎంత లాభాలు తెచ్చిందో అంతే రీతిలో భారీ నష్టాలని భోళా శంకర్ అందించింది. అయితే చిరు తో వర్క్ చేసిన నిర్మాతల్లో ఒకరైన ప్రముఖ సీనియర్ నిర్మాత చిరు విషయంలో పలు షాకింగ్ అంశాలు లేటెస్ట్ గా రివీల్ చేయడం వైరల్ గా మారింది.

కాగా మన ఇండియా ఓటిటి వెర్షన్ లో అతి పెద్ద హిట్ అయ్యిన సిరీస్ లిస్ట్ లో అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కి వచ్చిన సిరీస్ “ఫ్యామిలీ మేన్” కోసం తెలియని వారు ఉండరు. అంత వల్గారిటీ లేకుండా ఫ్యామిలీతో చూసే లానే ఉండే మొదటి సిరీస్ పెద్ద హిట్ అయ్యి రెండో సీజన్ పై భారీ హైప్ ని తెచ్చుకుంది.

అయితే ఇప్పుడు ఈ సిరీస్ ని అసలు మెగాస్టార్ కోసమే ఆ సిరీస్ సృష్టికర్తలు అయినటువంటి రాజ్ అండ్ డీకే లు ప్లాన్ చేసారని అశ్వనీదత్ రివీల్ చేయడం ఒకసారిగా వైరల్ గా మారింది. వారు చిరు కోసమే రెడీ చేస్తే దాన్ని ఏమో చిరు రిజెక్ట్ చేయడం ఇంకో ఎత్తు. అయితే దీనికి కారణం కూడా ఆయన చెప్పారు.

అప్పటికే చిరు రీ ఎంట్రీ ఇచ్చారు. పైగా సిరీస్ లో ఇద్దరు పిల్లలకి తండ్రి అంటున్నారు అని మొదట ఇష్టపడలేదు అట. అయితే పిల్లల పత్రాలు తీసేద్దాం అన్నా కూడా చిరు ఒప్పుకోలేదు అని దీనితో ఆ పాత్రని మనోజ్ బాజ్ పై చేసాడు అని తెలిపారు. ఓటిటిలో ఇప్పుడు అది పెద్ద హిట్ అలాంటిది చిరంజీవి చేసి ఉంటే ఇంకెంత పెద్ద హిట్ అయ్యి ఉండేది అని అభిప్రాయం వ్యక్తం చేశారు. దీనితో ఈ కామెంట్స్ ఇప్పుడు పెద్ద ఎత్తున వైరల్ అయిపోయాయి.