బుల్లితెరపై చలాకీ యాంకర్‌గా, అందమైన నవ్వుల పూదోటను వికసించేలా చేసిన యాంకర్‌గా లాస్య మంచి గుర్తింపు తెచ్చుకుంది. స్టార్ మా మ్యూజిక్‌లో రవితో కలిసి చేసిన సమ్‌థింగ్ స్పెషల్ అనే షోతో పాపులర్ అయింది. ఇక చీమ-ఏనుగు జోకులతో లాస్య వేసే కామెడీలపై ఎంతటి ట్రోలింగ్ జరుగుతుందో అందరికీ తెలిసిందే. అలాంటి లాస్య బిగ్‌బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టింది. ఇక తన నవ్వుల వెనుకున్న కథను చెప్పి అందర్నీ ఏడిపించింది.
లక్ష్మీ ప్రసన్న ప్రియాంక లాస్య రెడ్డి తన పూర్తి పేరు అని కడప సొంతూరు అని తెలిపింది. ఇంజనీరింగ్ అయిన తర్వాత ఏదో సాధించాలనే కోరికతో ఉండేదాన్నని పేర్కొంది. తమది వింత లవ్ స్టోరీ అని మొదటగా తామిద్దరం రిజిష్టర్డ్ మ్యారేజ్ చేసుకున్నామని పేర్కొంది. ఆ సమయంలో మా ఆయనకు జాబ్ లేదు. షో చేస్తే రోజుకు మూడు వందలు వచ్చేవి. అవి రెంటుకు కూడా సరిపోయేవి కాదు. డబ్బుల్లేక పదిరోజులు పస్తులున్నాను అంటూ అందర్నీ కన్నీరు పెట్టించింది.
తన జీవితంలో మళ్లీ రెండో పెళ్లి .. అది కూడా మా ఆయన్నే అందరి సమక్షంలో మళ్లీ పెళ్లి చేసుకోడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపింది. మా ఆనందం మొత్తం మా బాబు జున్ను(దక్ష్). బాబు బాధ్యతను మా ఆయనకు, మా అత్త, మామయ్యకు అప్పజెప్పానని తెలిపింది. క్వారంటైన్‌లో ఉన్న పదహారు రోజులు బాబుతో వీడియో కాల్ మాట్లాడాను. బాబు గుర్తుస్తే బాధగా ఉంటుందని, అయినా అమ్మ ఏం చేసినా పిల్లల కోసమే కదా వాడి ఫ్యూచర్ కోసమే అంటూ లాస్య హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. మరి లాస్య చివరి వరకు నిలబడి తన సత్తా చాటుతుందో లేదో చూడాలి.