బిగ్ న్యూస్ : ఆస్కార్స్ లో చోటు దక్కించుకున్న మెగాపవర్ 

ram-charan-gives-rrr-trailer-launch-a-miss-001

ఇప్పుడు వరల్డ్ వైడ్ గా కూడా మంచి ఫేమ్ సొంతం చేసుకున్న అతి కొద్దీ మంది టాలీవుడ్ హీరోస్ లో అయితే గ్లోబల్ సెన్సేషన్ మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఒకడు. మరి రామ్ చరణ్ హీరోగా నటించిన రీసెంట్ చిత్రం ట్రిపుల్ ఆర్(RRR) ఒక గ్లోబల్ ఫినామినాగా నిలవగా ఈ చిత్రం రిలీజ్ అయ్యాక తనకి అలాగే ఎన్టీఆర్ కి కూడా మరింత క్రేజ్ పెరిగింది.

అయితే ఆస్కార్ వరకు కూడా వెళ్లిన ఈ చిత్రం ఈ తర్వాత ఆస్కార్ లో కొత్త సభ్యుల చేరికల విషయంలో ఆస్కార్ వారు మొదట ఓ లిస్ట్ ని రిలీజ్ చేయగా అందులో అయితే కొందరు సపోర్టింగ్ నటుల నుంచి హాలీవుడ్ లో అనేక చిత్రాల్లో సపోర్టింగ్ పాత్రలు చేసిన నటులుతో పాటుగా ఇండియన్ సినిమా నుంచి ఎన్టీఆర్ ని కూడా కొత్త సభ్యునిగా అయితే ఆహ్వానించారు.

కాగా ఇప్పుడు అయ్యితే మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కి కూడా ఆహ్వానం అందించారు. కాగా ఈ లిస్ట్ లో అయితే హాలీవుడ్ సీనియర్ నటులు పలు చిత్రాల్లో మెయిన్ లీడ్ లో నటించిన ఫీమేల్ నటులతో కలిపిన లిస్ట్ లో అయితే రామ్ చరణ్ స్థానం దక్కించుకున్నాడు.

దీనితో ఇప్పుడు ఈ పోస్ట్ వైరల్ గా మారగా రామ్ చరణ్ పేరు మరోసారి వైరల్ గా మారింది. కాగా ఇప్పుడు రామ్ చరణ్ అండ్ మెగా కుటుంబం అంతా కూడా వరుణ్ తేజ్ పెళ్ళిలో ఆనందంగా గడుపుతూ ఉండగా ఈ హ్యాపీ సమయంలో మరో సంతోషకర వార్త అయితే మెగా ఫ్యాన్స్ కి మరింత ఆనందాన్ని అయితే తీసుకొచ్చింది.