ఎంత మన టాలీవుడ్ దగ్గర స్టార్ హీరోలు బయటకి అంతా హ్యాపీ గా కనిపించినా వారికంటూ కుటుంబాలు ఉంటాయి వారిలోని ఏవోక చిన్న కలహాలు ఉంటూనే ఉంటాయి. అలాగే మెగా ఫ్యామిలిలో కొన్ని ఉన్నాయని ఉండడం కామన్ అని వారే పలు సందర్భాల్లో చెప్పారు.
కానీ ఒక స్టేజి లో వారు అంతా ఒకటే అని నిలబడతారు. మరి అలాగే నందమూరి కుటుంబంలో కూడా ఇలాంటి వాతావరణమే ఉంటుందని అందరికీ తెలిసిందే. మరి ఈ విషయాల్లో అయితే జూనియర్ ఎన్టీఆర్ అలాగే బాలయ్య ఇతర హీరోల విషయాల్లో కాస్త మేటర్ ఆసక్తిగానే ఉంటుంది.
ఒకప్పుడు సంగతి ఏమో కానీ ఇప్పుడు మాత్రం ఎన్టీఆర్ రేంజ్ వేరు.. తాను కూడా బాలయ్య సహా ఇతర కొన్ని అంశాల్లో చాలా సెటిల్డ్ గానే ప్రవర్తిస్తాడు. మరి నిన్న లేటెస్ట్ గా బింబిసార ఈవెంట్ కి హాజరు అయ్యిన తాను అక్కడ కూడా అలాగే ఉన్నాడు.
అయితే ఈ ఈవెంట్ లో ఎన్టీఆర్ తో పాటు బాలయ్య ఫ్యాన్స్ కూడా హాజరయ్యారు. కానీ కొంతమంది కామెంట్స్ అయితే సోషల్ మీడియాలో రచ్చగా మారాయి. బాలయ్య తర్వాతే ఎవరైనా అని కాస్త ఎన్టీఆర్ అభిమానులకి నొచ్చుకునే విధంగా అక్కడే కామెంట్స్ చేశారు.
దీనితో ఇవి ఎన్టీఆర్ ఫాన్స్ వర్సెస్ బాలయ్య ఫ్యాన్స్ లా మారిందని అంటున్నారు. దీనితో అభిమానుల మధ్య మాత్రం అలా కోల్డ్ వార్ ఉంటూనే ఉందని కొన్ని కామెంట్స్ వినిపిస్తున్నాయి.