బికినీ ఫోటోతో మత్తెక్కిస్తున్న అవికా గోర్ !

స్టార్ మా లో ప్రసారం అయిన చిన్నారి పెళ్లి కూతురు సీరియ‌ల్ ‌తో తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్న న‌టి అవికా గోర్. ఈ సీరియ‌ల్‌లో అవికా న‌ట‌న‌కు ఇంప్రెస్ అయిన మేకర్స్ ఆమెను హీరోయి న్‌గా పెట్టి ఉయ్యాల జంపాల అనే సినిమా తీసారు. ఈ సినిమా మంచి విజ‌యం సాధించ‌డంతో అవికాకు అనేక సినిమా ఆఫ‌ర్స్ వ‌చ్చాయి.

ఇందులో ఏ సినిమా కూడా పెద్ద‌గా హిట్ సాధించ‌క‌పోవ‌డంతో పెద్దగా ఫెమస్ కాలేకపోయింది. ఈ మ‌ధ్య స్లిమ్ లుక్‌ లోకి మారి ఆ ఫొటోల‌ను త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో చేయ‌డంతో ఫుల్ వైర‌ల్ అయ్యాయి. అవికాలోని మార్పు చూసి అంతా ఆశ్చ‌ర్య‌పోయారు. సెకండ్ ఇన్నింగ్స్ మొద‌లు పెట్టేందుకు సిద్దంగా ఉన్నాన‌ని చెప్పిన అవికా ఇప్పుడు బికినీలో రెచ్చిపోయింది. స్విమ్మింగ్ పూల్ గ‌ట్టుపై ఆస‌నం వేసిన‌ట్టుగా ప‌డుకుంది. ఇది చూసిన ప్ర‌తి ఒక్క‌రు షాక్ అవుతున్నారు.

ఇన్నాళ్లు సంప్ర‌దాయ‌బ‌ద్ధంగా క‌నిపించే అవికా ఇలాంటి షాక్ ఇచ్చిందేంట‌ని కామెంట్స్ చేస్తున్నారు. కాగా, అవికా ప్ర‌స్తుతం మిలింద్ చ‌ద్వానీ అనే వ్య‌క్తితో ప్రేమ‌లో ఉండ‌గా, ఇటీవ‌ల ఈ విష‌యాన్ని సోష‌ల్ మీడియా ద్వారా షేర్ చేసింది. పెళ్లి ఇప్ప‌ట్లో చేసుకోమ‌ని అన్న‌ అవికా..ప్రేమ‌, జీవితం అంద‌మైన అనుభవంలా ఉందంటూ కాబోయే భ‌ర్త‌తో క‌లిసి దిగిన ఫొటోలు షేర్ చేసింది.