Amitabh Bachchan: పుష్ప డైలాగ్ చెప్పిన అమితాబ్.. సంతోషం వ్యక్తం చేస్తున్న నిర్మాణ సంస్థ!

Amitabh Bachchan: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప సినిమా ఎలాంటి క్రేజ్ దక్కించుకుందో మనకు తెలిసిందే. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిన ఈ సినిమా దేశవ్యాప్తంగా ఎంతో మంచి ఆదరణ దక్కించుకుంది. ముఖ్యంగా నార్త్ ఇండియాలో ఈ సినిమాకు ఎంతో మంచి క్రేజ్ వచ్చింది.ఈ సినిమాలోని డైలాగులు పాటలు రీల్స్ చేస్తూ నార్త్ ఇండియా ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.

ఈ సినిమా గత ఏడాది డిసెంబర్ నెలలో విడుదల అయినప్పటికీ ఇప్పటికీ ఏ మాత్రం క్రేజ్ తగ్గలేదు. ఇలా ఎంతో మంది అభిమానుల నుంచి సెలబ్రిటీలు క్రికెటర్ల వరకు పుష్ప సినిమా గురించి ప్రశంసలు కురిపించారు. తాజాగా బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ నోటివెంట పుష్ప డైలాగ్ రావడం గమనార్హం. అమితాబచ్చన్ కూడా పుష్ప సినిమాలో డైలాగ్ పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా ఫైర్ అనే డైలాగ్ చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ సినిమాలో ఈ డైలాగ్ ఎంత ఫేమస్ అయ్యిందో మనకు తెలిసిందే.

ఈ క్రమంలోనే అమితాబచ్చన్ కౌన్ బనేగా కరోడ్పతి కార్యక్రమంలో భాగంగా ఈ డైలాగు చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచారు.ఈ విధంగా అమితాబచ్చన్ నోటివెంట పుష్ప డైలాగ్ రావడంతో అల్లు అర్జున్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ విషయం పై పుష్ప నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ స్పందిస్తూ అమితాబ్ బచ్చన్ చెప్పిన ఈ డైలాగ్ వీడియోను తమ అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా షేర్ చేశారు. ఇక ఈ విషయం తెలిసిన అల్లు అర్జున్ అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.