బర్త్‌డే బాయ్‌ బన్నీకి వెల్లువెత్తిన విషెస్‌.. ‘పుష్ప-2’ నుంచి అల్లు గెటప్‌ విడుదల!

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు సోషల్‌ విూడియా వేదికగా అభిమానులు, సినీ ప్రముఖులు బర్త్‌ డే విషెస్‌ తెలిపారు. ఇప్పటికే టాలీవుడ్‌ అగ్ర నటుడు మ్యాన్‌ ఆఫ్‌ మాసెస్‌ ఎన్టీఆర్‌ కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు బావ అంటూ బన్నికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపాడు. తాజాగా జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ అల్లు అర్జున్‌కు ఎక్స్‌ వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపాడు.హ్యాపీ బర్త్‌ డే బన్నీ.. జాతీయ అవార్డుగ్రహీత, చక్కటి అభినయ కౌశలం కలిగిన కథానాయకుడు అల్లు అర్జున్‌ కి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.

భవిష్యత్తులో బన్నీ మరిన్ని పురస్కారాలు, విజయాలు అందుకోవాలని ఆకాంక్షిస్తున్నాను అంటూ పవన్‌ కళ్యాణ్‌ తెలిపాడు. అల్లు అర్జున్‌ పుట్టినరోజు సందర్భంగా సినీ ప్రముఖులతో పాటు పలువురు సెలబ్రిటీలు బన్నికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అయితే అల్లు అర్జున్‌ నటిస్తున్న పాన్‌ ఇండియా మోస్ట్‌ అవైటెడ్‌ ప్రాజెక్ట్‌ పుష్ప.. ది రూల్‌. ఈ సినిమాకు లెక్కల మాస్టార్‌ సుకుమార్‌ దర్శకత్వం వహిస్తుండగా.. కన్నడ భామ రష్మిక మందన్నామరోసారి ఫీ మేల్‌ లీడ్‌ రోల్‌ పోషిస్తోంది. ఈ సినిమా నుంచి బన్ని బర్త్‌ డే కానుకగా టీజర్‌ విడుదల చేయనున్నట్లు మేకర్స్‌ అనౌన్స్‌ చేసిన విషయం తెలిసిందే.

తాజాగా ఈ సినిమా నుంచి మేకర్స్‌ టీజర్‌ విడుదల చేశారు. గంగమ్మ తల్లి జాతరలో అమ్మవారి గెటప్‌ లో అల్లు అర్జున్‌ ఫైట్‌ సీన్‌తో ఫుల్‌ యాక్షన్‌ ప్యాక్ట్‌డ్‌గా సాగింది ఈ టీజర్‌. సోమవారం అల్లు అర్జున్‌ పుట్టినరోజు పురస్కరించుకుని చిత్రబృందం స్పెషల్‌ సర్‌ప్రైజ్‌ ఇచ్చింది. ’పుష్ప ది రూల్‌’ టీజర్‌ విడుదల చేసింది. సినిమాలో కీలకంగా సాగే జాతర సన్నివేశాలతో ఇది సిద్ధమైంది. మాస్‌ అవతార్‌లో బన్నీ లుక్స్‌, యాక్షన్‌ సన్నివేశాలు ఈలలు వేయించేలా ఉన్నాయి. ఎర్రచందనం స్మగ్లింగ్‌ నేపథ్యంలో సాగే కథతో తెరకెక్కిన చిత్రం ’పుష్ప ది రైజ్‌’. 2021లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది.

ఎర్రచందనం కూలీ నుంచి స్మగ్లింగ్‌ సిండికేట్‌కు నాయకుడిగా పుష్ప ఎలా ఎదిగాడని మొదటి భాగంలో చూపించారు. మరి, సిండికేట్‌కు లీడర్‌ అయ్యాక పుష్పకు ఎదురైన సవాళ్లు ఏమిటి? మంగళం శ్రీను, భన్వర్‌ సింగ్‌ షెకావత్‌, దాక్షాయణి నుంచి ఎలాంటి ప్రమాదం పొంచి ఉందనే అంశాలతో ’పుష్ప ది రూల్‌’ సిద్ధం కానున్నట్లు తెలుస్తోంది. మైత్రి మూవీ మేకర్స్‌ పతాకంపై ఇది నిర్మితమవుతోంది. దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలు అందిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌ తెరకెక్కిస్తున్న సీక్వెల్‌ ప్రాజెక్టులో కన్నడ భామ రష్మిక మందన్నామరోసారి ఫీ మేల్‌ లీడ్‌ రోల్‌ పోషిస్తోంది. శ్రీవల్లిగా డీగ్లామరైజ్‌డ్‌ రోల్‌లో కనిపించనుంది . పార్టు 2లో ఫహద్‌ ఫాసిల్‌, జగదీష్‌ ప్రతాప్‌ బండారి, జగపతిబాబు, ప్రకాశ్‌ రాజ్‌, సునీల్‌, అనసూయ భరద్వాజ్‌, రావు రమేశ్‌, ధనంజయ, షణ్ముఖ్‌, అజయ్‌, శ్రీతేజ్‌ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.