గాడ్ ఆఫ్ మాసెస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ఇపుడు పలు సినిమాలు ఒకే చేసి ఒకదాని తర్వాత ఒక సినిమాని అయితే బ్రిస్క్ పేస్ లో కంప్లీట్ చేస్తూ వెళ్తున్న సంగతి తెలిసిందే. కాగా పవన్ ఇప్పుడు హీరోగా చేస్తున్న సినిమాల్లో కొన్ని రోజులు కితం అనౌన్స్ అయ్యిన రీమేక్ సినిమా కూడా ఒకటి.
కాగా ఈ చిత్రాన్ని తమిళ్ హిట్ అయ్యిన సినిమా వినోదయ సైతం కి రీమేక్ గా ప్లాన్ చేస్తున్నారు. కాగా ఇందులో పవన్ ఓ కీలక పాత్రలో నటిస్తుండగా మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ మెయిన్ లీడ్ లో నటిస్తున్నాడు. అయితే ఈ సినిమా కోసం పవన్ కి నిర్మాతలు ఆల్ టైం రికార్డు రెమ్యునరేషన్ ముట్టజెప్తున్నట్టుగా లేటెస్ట్ గాసిప్స్ వినిపిస్తున్నాయి.
ఇది వరకు పవన్ భీమ్లా నాయక్ కోసం రోజుకి 2 కోట్లు ఛార్జ్ చేయగా ఈ సినిమా కోసం ఏకంగా 3.5 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటున్నారట. దీనిని నిర్మాణ సంస్థ ఎలాంటి ఇబ్బంది లేకుండా పవన్ కి ఇచ్చి సినిమా చేయించుకుంటున్నట్టుగా తెలుస్తుంది. దీనితో పవన్ సినిమాకి ఇచ్చిన డేట్ తో ఏకంగా 75 కోట్ల రెమ్యునరేషన్ ఈ సినిమా కోసం తాను తీసుకుంటున్నట్టుగా సినీ వర్గాల్లో గాసిప్.
దీనితో అయితే హైయెస్ట్ రెమ్యునరేషన్ అందుకుంటున్న హీరోగా టాలీవుడ్ నుంచి పవన్ అందులోని నాన్ పాన్ ఇండియా సినిమా లిస్ట్ లో మొదటి స్థానంలో నిలిచారు. మరి ఇంత మొత్తానికి పవన్ ని సరిగా వాడుకోకపోతే ఆ డబ్బులు తిరిగి రావడం కష్టమే అని చెప్పాలి.