యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మొదటిసారిగా చేసిన భారీ హిందీ సినిమా “ఆదిపురుష్”. దీనితోనే ప్రభాస్ బాలీవుడ్ ఎంట్రీ కూడా ఇవ్వనుండగా దర్శకుడు ఓంరౌత్ అయితే ఓ బిగ్గెస్ట్ డివైన్ ఎంట్రీ ని ప్రభాస్ కోసం సిద్ధం చేసాడు. అయితే విజువల్స్ పరంగా సినిమా మొదట్లో ఆకట్టుకోలేదు కానీ ఇపుడు సినిమా గ్రాఫిక్స్ అన్నీ అప్డేట్ చేసాక అయితే తెచ్చుకున్నారు.
అలాగే అప్డేట్ చేసిన టీజర్ కి కూడా ఇప్పుడు క్రేజీ రెస్పాన్స్ వస్తుంది. ఇక ఇలా నెమ్మదిగా హైప్ ని కొనసాగిస్తున్న ఈ సినిమాపై ఇపుడు ఓ రేంజ్ లో నిలబెట్టేలా ఒక్క దెబ్బతో మేకర్స్ ఇండియా వైడ్ ఆదిపురుష్ జపం చేసేలా స్టార్ట్ చేసారు. అయితే ఈ భారీ సినిమా నుంచి గత కొన్నాళ్లుగా మొదటి పాట జై శ్రీరామ్ కోసం ఎదురు చూస్తున్నారు.
అయితే దీనిని తెలుగు సహా హిందీ భాషల్లో కలిపి మోషన్ పోస్టర్ టీజర్ తో అయితే రిలీజ్ చేశారు. మరి ఈ సాంగ్ వింటేనే ఒళ్ళు గగుర్పొడిచేలా అనిపిస్తుందని చెప్పొచ్చు. అప్పుడు హిందీలో వింటేనే మనవాళ్ళకి ఓ రేంజ్ లో అనిపించింది. ఇక ఇప్పుడు మన మాతృభాషలో అందులోని రామ జోగయ్య శాస్త్రి సాహిత్యంతో నెక్స్ట్ లెవెల్లో ఈ సాంగ్ అనిపిస్తుంది.
దీనితో ఇక్కడ నుంచి అయ్యితే ఇక ఆదిపురుష్ మేనియా స్టార్ట్ అని చెప్పొచ్చు. కాకపోతే ఇందులో మైనస్ పాయింట్ ఏమన్నా ఉంది అంటే ఈ ఫుల్ సాంగ్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు అనేది రివీల్ చేయలేదు. కాగా ఈ సినిమాకి అయితే అజయ్ – అతుల్ అనే హిందీ మ్యూజిక్ డ్యుయో సంగీతం అందిస్తున్నారు. టి సిరీస్ వారు నిర్మాణం వహించిన ఈ చిత్రం ఈ జూన్ 16న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది.
జన్మధన్యం..జానకీరాముని సేవాభాగ్యం 🙏 https://t.co/avQGSMWNln
— RamajogaiahSastry (@ramjowrites) April 22, 2023
