మన దేశంలో సురక్షితంగా ఇన్వెస్ట్ చేయాలని భావించే వాళ్లకు పోస్టాఫీస్ స్కీమ్స్ బెస్ట్ ఆప్షన్ చెప్పవచ్చు. పోస్టాఫీస్ స్కీమ్స్ గురించి సరైన అవగాహన ఉంటే ఈ స్కీమ్స్ లో ఇన్వెస్ట్ చేయడం మంచిది. పోస్టాఫీస్ స్కీమ్స్ లో రికరింగ్ డిపాజిట్ స్కీమ్ ఒకటి కాగా ఈ స్కీమ్ లో రోజుకు 333 రూపాయల పొదుపుతో 16 లక్షల రూపాయలు పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.
ప్రతి నెలా ఈ స్కీమ్ లో 10,000 రూపాయలు డిపాజిట్ చేస్తే పదేళ్ల తర్వాత 16 లక్షల రూపాయలు పొందే అవకాశం అయితే ఉంటుంది. పదేళ్లలో డిపాజిట్ చేసే మొత్తం 12 లక్షల రూపాయలు కాగా 4 లక్షల రూపాయలు లాభంగా పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. ప్రస్తుతం ఈ స్కీమ్ పై వడ్డీ 5.8 శాతంగా ఉండటం గమనార్హం. ప్రతి మూడు నెలలకు ఒకసారి వడ్డీని లెక్కించడం జరుగుతుంది.
పోస్టల్ డిపాజిట్ స్కీమ్స్ ప్రభుత్వ స్కీమ్స్ కావడంతో ఈ స్కీమ్స్ లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఎక్కువ మొత్తంలో బెనిఫిట్ పొందే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. తక్కువ మొత్తంలో ఇన్వెస్ట్ చేయాలని భావించే వాళ్లకు పోస్టాఫీస్ స్కీమ్ బెస్ట్ ఆప్షన్ అవుతుందని చెప్పవచ్చు. ఐదు సంవత్సరాల పాటు డిపాజిట్ చేయాలని అనుకుంటే అదే విధంగా డిపాజిట్ చేయవచ్చు.
పోస్టల్ డిపాజిట్ స్కీమ్స్ గురించి అవగాహన కలిగి ఉన్నవాళ్లు మాత్రమే ఈ స్కీమ్స్ లో ఇన్వెస్ట్ చేసెతే మంచిది. ఈ స్కీమ్స్ వల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎంతగానో ప్రయోజనం చేకూరుతుంది. పోస్టల్ రికరింగ్ డిపాజిట్లు మంచి రాబడిని అందిస్తున్న నేపథ్యంలో ఈ స్కీమ్స్ కు ఆదరణ పెరుగుతోంది.