పోస్టాఫీస్‌ సూపర్ స్కీమ్.. రూ.10,000 డిపాజిట్ తో ఏకంగా రూ.17 లక్షలు పొందే ఛాన్స్!

రిస్క్ లేకుండా రాబడి పొందాలని భావించే వాళ్లకు పోస్టాఫీస్ స్కీమ్స్ ను మించిన బెస్ట్ స్కీమ్స్ అయితే ఉండవని చెప్పవచ్చు. పోస్టాఫీస్ స్కీమ్స్ లో రికరింగ్ డిపాజిట్ స్కీమ్ ఒకటి కాగా ఈ స్కీమ్ లో డబ్బులు ఇన్వెస్ట్ చేసేవాళ్లు ఒకేసారి భారీ మొత్తం పొందవచ్చు. ప్రస్తుతం ఈ స్కీమ్ పై 6.5 శాతం వడ్డీ రేటు అమలవుతుండటం గమనార్హం. నెలకు 100 రూపాయల నుంచి ఎంత మొత్తమైనా ఈ స్కీమ్ లో డిపాజిట్ చేయవచ్చు.

నెలకు 10,000 రూపాయల చొప్పున ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేస్తే ఐదేళ్లలో రూ.7 లక్షలు పొందే అవకాశం ఉండగా 10 సంవత్సరాలు ఈ స్కీమ్ లో డిపాజిట్ చేస్తే ఏకంగా 17 లక్షల రూపాయలు పొందవచ్చు. దీర్ఘకాలంలో లాభాలు పొందాలని భావించే వాళ్లకు ఈ స్కీమ్ బెస్ట్ ఆప్షన్ అవుతుందని చెప్పవచ్చు. ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేసే డబ్బులకు కేంద్ర ప్రభుత్వం నుంచి హామీ ఉంటుంది.

మెచ్యూర్ విత్‌డ్రాయెల్ ఫెసిలిటీతో పాటు లోన్ సదుపాయం ఉండటంతో అర్హత ఉన్నవాళ్లు ఈ స్కీమ్ పై దృష్టి పెడితే దీర్ఘకాలంలో మంచి ప్రయోజనాలను పొందే అవకాశం అయితే ఉంటుంది. జాయింట్‌గా లేదా సింగిల్ అకౌంట్ రూపంలో ఈ అకౌంట్ ను ఓపెన్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఒకేసారి భారీ మొత్తం పొందాలని భావించే వాళ్లు ఈ స్కీమ్ పై దృష్టి పెడితే మంచిది.

లోన్ తీసుకుంటే ఆర్‌డీ వడ్డీ రేటు కన్నా కేవలం 2 శాతం ఎక్కువగా ఉండటంతో ఈ స్కీమ్ ప్రయోజనకరంగా ఉంటుంది. పోస్టాఫీస్ స్కీమ్ వల్ల అన్ని వర్గాల ప్రయోజనం చేకూరుతాయి. ఈ స్కీమ్స్ గురించి పూర్తిస్థాయిలో తెలుసుకుని ఇన్వెస్ట్ చేస్తే మంచిది. ఈ స్కీమ్ ద్వారా ఎన్నో ప్రయోజనాలు చేకూరుతాయి.