బరువు తగ్గాలనుకుంటే, కేలరీల తీసుకోవడాన్ని తగ్గించి, వ్యాయామం చేయాల్సి ఉంటుంది. తగినంత నీరు త్రాగడంతో పాటు పోషకాలు సమతుల్యం ఉండేలా చూసుకోవాలి. మీరు బర్న్ చేసే దానికంటే తక్కువ కేలరీలు తీసుకోవడం ద్వారా బరువు తగ్గవచ్చు. పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాలు తీసుకోవడం ద్వారా సులువుగానే బరువు తగ్గే అవకాశాలు ఉంటాయి.
జంక్ ఫుడ్, ప్రాసెస్ చేసిన ఆహారాలు, తీపి పానీయాలు తగ్గించడం ద్వారా బరువు తగ్గవచ్చు. రోజుకు కనీసం 3 నుంచి 4 లీటర్ల నీటిని తాగడం ద్వారా బరువు తగ్గే అవకాశాలు ఉంటాయి. ఒకే సమయంలో భోజనం చేయడంతో పాటు ఎక్కువ సమయం గ్యాప్ లేకుండా చూసుకుంటే బరువు తగ్గే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. నడక, జాగింగ్, సైక్లింగ్ వంటి వ్యాయామాలు చేయడం ఆరోగ్యానికి మంచిది.
బరువులు ఎత్తడం, యోగా వంటి వ్యాయామాలు చేయడం ద్వారా బరువు తగ్గవచ్చు. ప్రతిరోజూ 30 నిమిషాల పాటు వ్యాయామం చేయడం ద్వారా వెయిట్ కంట్రోల్ లో ఉంటుంది. బరువు తగ్గాలని భావించే వాళ్లు నిద్ర విషయంలో సైతం తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. రోజుకు కనీసం 7 నుంచి 8 గంటల పాటు నిద్ర ఉండే విధంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
కొన్ని సందర్భాల్లో ఒత్తిడి వల్ల కూడా బరువు పెరిగే అవకాశాలు ఉంటాయి. బరువు తగ్గాలని ఫీలయ్యే వాళ్లు బరువును కంట్రోల్ లో ఉంచుకోవాల్సి ఉంటుంది. బరువు తగ్గడానికి ప్రతిరోజూ జిమ్ కు వెళ్లడం అలవాటు చేసుకోవాలి. ఈ చిట్కాలు పాటిస్తే కచ్చితంగా మంచి ఫలితాలు ఉంటాయని చెప్పవచ్చు.