మనలో చాలామంది సంపాదించిన డబ్బును తెలివిగా ఇన్వెస్ట్ చేయాలని భావిస్తారు. ఎస్బీఐ స్పెషల్ ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా దీర్ఘకాలంలో మంచి లాభాలను పొందే అవకాశాలు అయితే ఉంటాయి. అమృత్ కలాష్ ఫిక్స్‌డ్ డిపాజిట్ పేరుతో ఎస్బీఐ ఒక స్కీమ్ ను అమలు చేస్తుండటం గమనార్హం. సాధారణ ప్రజలు, సీనియర్ సిటిజన్లు ఇందులో ఇన్వెస్ట్ చేసే ఛాన్స్ అయితే ఉంటుంది.
400 రోజుల స్పెషల్ ఇన్వెస్ట్మెంట్ పీరియడ్ తో ఈ స్కీమ్ అమలవుతుండటం గమనార్హం. పెట్టుబడిపై త్వరగా రిటర్న్స్ పొందాలని భావించే వాళ్లు ఈ స్కీమ్ పై దృష్టి పెడితే మంచిది. ఈ స్కీమ్ లో సీనియర్ సిటిజన్లకు 7.6 శాతం వడ్డీ రేటు లభిస్తుండగా సాధారణ పౌరులకు మాత్రం 7.1 శాతం వడ్డీ రేటు లభిస్తుంది. ఇతర స్కీమ్స్ లో పొందే వడ్డీ రేటుతో పోల్చి చూస్తే ఈ మొత్తం ఒకింత ఎక్కువ కావడం గమనార్హం.
ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేసిన డబ్బులకు సంబంధించి కచ్చితమైన ప్రయోజనాలను పొందే అవకాశాలు అయితే ఉంటాయి. ఆర్థిక లక్ష్యాలను చేరుకోవాలని భావించే వాళ్లు ఈ స్కీమ్ పై దృష్టి పెడితే మంచిది. ఏదైనా కారణాల చేత ఇన్వెస్ట్ చేసిన డబ్బులను ముందుగా విత్ డ్రా చేసుకోవాలని భావించే వాళ్లు విత్ డ్రా చేసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.
ఈ స్కీమ్ కు సంబంధించి ఫ్లెక్సిబుల్ ఇన్వెస్ట్‌మెంట్ ఆప్షన్లు అందుబాటులో ఉండగా సమీపంలోని ఎస్బీఐ బ్రాంచ్ ను సంప్రదించడం ద్వారా ఈ స్కీమ్ కు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. ఎస్బీఐ బ్రాంచ్ కస్టమర్లకు ఈ స్కీమ్ ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పడంలో సందేహం అక్కర్లేదు.