నేషనల్ ఎంట్రన్స్ స్క్రీనింగ్ టెస్ట్ 2025 నిరుద్యోగులకు తీపికబురు చెప్పింది. సైన్స్, మ్యాథ్స్ కోర్సులలో ఉన్నత విద్య చదవాలని భావించే విద్యార్థులకు ప్రయోజనం చేకూరే విధంగా తాజాగా నోటిఫికేషన్ విడుదలైంది. ఈ టెస్ట్ లో రాణించిన వాళ్లు ప్రముఖ కాలేజ్ లలొ ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ కోర్సులు చేయవచ్చు. ఇలా అవకాశం పొందిన వాళ్లు నెలకు 5000 రూపాయల స్కాలర్ షిప్ పొందవచ్చు.
వేసవిలో ఇంటర్న్ షిప్ కోసం 20,000 రూపాయల చొప్పున గ్రాంట్ పొందే అవకాశాలు ఉంటాయి. విద్యార్థులకు సైన్స్ కోర్సులలో ఆసక్తి పెంచి పరిశోధనల దిశగా వారిని ప్రోత్సహించాలనే లక్ష్యంతో నెస్ట్ నిర్వహించడం జరుగుతుంది. బోధన, పరిశోధన రంగాలలో సుదీర్ఘ అనుభవం ఉన్న ఫ్యాకల్టీ, ఆధునాతన ల్యాబ్ సౌకర్యాలను కల్పించడం జరుగుతుంది.
విదేశీ శాస్త్రవేత్తలు సైతం ఇక్కడ బోధిస్తారు కాబట్టి విద్యార్థులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. నైసర్ లో 200 సీట్లు ఉండగా సీ.బీ.ఎస్.ఈలో ఏకంగా 57 సీట్లు ఉన్నాయి. ఇందులో ప్రతిభ చూపిన వాళ్లకు బార్క్ ట్రైనింగ్ స్కూల్ లో పరీక్ష రాయకుండానే ఇంటర్వ్యూలో పాల్గొనడానికి అనుమతులు లభిస్తాయి. 2023, 2024 సంవత్సరాలలో ఇంటర్ పాసైన వాళ్లు నెస్ట్ కు అర్హులు.
కనీసం 60 శాతం మార్కులు సాధించిన వాళ్లు మాత్రమే దరఖాస్తు చేసుకునే అవకాశం ఉండగా ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 55 శాతం ఉంటే సరిపోతుంది. మే నెల 31వ తేదీ వరకు ఇందుకు సంబంధించిన దరఖాస్తులు చేసుకునే ఛాన్స్ ఉంటుంది. జనరల్, ఓబీసీ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు 1400 రూపాయలు కాగా మిగతా అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు 700 రూపాయలుగా ఉంది.
