పురుగుల మందు తాగిన వాళ్లకు చేయాల్సిన చికిత్స ఇదే.. ఈ తప్పులు అస్సలు చేయొద్దు!

పురుగుల మందు తాగడం అత్యంత ప్రమాదకరం అనే సంగతి తెలిసిందే. పురుగుల మందు తాగిన వ్యక్తిని వెంటనే ఆస్పత్రికి తీసుకొని వెళ్లడం ఎంతో ముఖ్యమని చెప్పవచ్చు. ఆసుపత్రికి వెళ్ళే ముందు, విషం తాగిన వ్యక్తికి వెంటనే నీరు లేదా పాలు తాగించడం ద్వారా విషం ప్రభావాన్ని కొంతమేర తగ్గించవచ్చు. వైద్యుల సలహాలు, సూచనలు తీసుకోకుండా వాంతులు చేయించడం మంచిది కాదు.

విషం శరీరంలోకి వెళ్ళకుండా వెంటనే చికిత్స ప్రారంభించటం చాలా ముఖ్యం అని చెప్పవచ్చు. విషం తాగిన వ్యక్తికి వాంతులు చేయించకూడదు, ఎందుకంటే అది విషం మరింత లోపలికి వెళ్ళడానికి అవకాశం కల్పిస్తుంది. ఆసుపత్రికి వెళ్ళేటప్పుడు, ఏ రకమైన పురుగుల మందు తాగారో, ఎంత తాగారో, ఎప్పుడు తాగారో అనే సమాచారం డాక్టర్లకు అందించడం ద్వారా వేగంగా చికిత్స అందించవచ్చు.

ఆసుపత్రికి వెళ్ళేటప్పుడు, పురుగుల మందు సీసా లేదా లబ్లింగ్ తీసుకెళ్లడం ద్వారా, డాక్టర్లు విషం రకాన్ని సులభంగా గుర్తించగలరు. పురుగుల మందు తాగిన వ్యక్తులలో కొన్ని లక్షణాలు ప్రధానంగా కనిపిస్తాయని చెప్పవచ్చు. కళ్ళు చెమర్చడం, దృష్టి మసకబారడం, లాలాజలం కారడం, చెమటలు పట్టడం, దగ్గు, వాంతులు, తరచుగా మలవిసర్జన మరియు మూత్రవిసర్జన, హృదయ స్పందన రేటు తగ్గిపోయి అస్థిరంగా మారడం, తక్కువ రక్తపోటు లక్షణాలు కనిపిస్తాయి.

పురుగుల మందు తాగిన వ్యక్తికి సకాలంలో చికిత్స అందించడం ద్వారా ఆరోగ్య సమస్యల బారిన పడే ఛాన్స్ తగ్గుతుంది. సాధారణంగా పురుగు మందులు చర్మం, ముక్కు, నోరు ద్వారా శరీరంలోకి వెళ్లే అవకాశాలుంటాయి.