స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సూపర్ స్కీమ్.. రూ.10 వేల పెట్టుబడితో రూ.18 లక్షలు పొందే ఛాన్స్!

దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రజలకు ప్రయోజనం చేకూరేలా ఎన్నో స్కీమ్స్ ను అమలులోకి తెస్తోంది. ఎస్బీఐ స్కీమ్స్ లో రికరింగ్ డిపాజిట్ స్కీమ్ ఒకటి కాగా నెలకు రూ.5 వేల పెట్టుబడితో ఈ స్కీమ్ ద్వారా కళ్లు చెదిరే స్థాయిలో ఆదాయాన్ని పొందవచ్చు. స్టేట్ బ్యాంక్ లో రికరింగ్ డిపాజిట్ అకౌంట్ ను ఓపెన్ చేయడం ద్వారా ఈ బెనిఫిట్ సొంతమవుతుందని చెప్పవచ్చు.

ఐదేళ్ల నుంచి పదేళ్ల టెన్యూర్ తో ఈ స్కీమ్ అమలవుతుండగా ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేసిన డబ్బులకు 7.5 శాతం వడ్డీ లభిస్తుంది. నచ్చిన టెన్యూర్ ను ఎంచుకుని డబ్బులు డిపాజిట్ చేసే అవకాశం ఉండటంతో ఈ స్కీమ్ ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. నెలకు 5,000 చొప్పున పదేళ్లు డిపాజిట్ చేస్తే రూ.9 లక్షలు వచ్చే అవకాశం ఉంటుంది. నెలకు 5 వేలు కాకుండా 10 వేలు డిపాజిట్ చేస్తే 18 లక్షల రూపాయలు పొందే అవకాశం అయితే ఉంటుంది.

ఎక్కువ మొత్తం ఇన్వెస్ట్ చేస్తే ఎక్కువ మొత్తం బెనిఫిట్ పొందే అవకాశం ఉండగా చిన్న మొత్తంలో ఎలాంటి రిస్క్ లేకుండా డబ్బులు దాచుకునే వాళ్లకు ఈ స్కీమ్ బెస్ట్ ఆప్షన్ అవుతుంది. సమీపంలోని ఎస్బీఐ బ్రాంచ్ ను సంప్రదించడం ద్వారా ఈ స్కీమ్ కు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే అవకాశం ఉంటుంది. మెచ్యూరిటీ సమయంలో మాత్రమే డబ్బు పొందే అవకాశం ఉండటంతో తెలివిగా ఇన్వెస్ట్ చేస్తే మంచిది.

ప్రస్తుత కాలంలో సేవింగ్స్ ఎంతో ముఖ్యం కాగా సేవింగ్స్ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే దీర్ఘకాలంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు అయితే ఉంటాయి. ఎస్బీఐ స్కీమ్స్ గురించి పూర్తిస్థాయిలో అవగాహనను కలిగి ఉంటే ఎక్కువ మొత్తం ఇన్వెస్ట్ చేసి ఎక్కువ మొత్తం లాభాలను పొందవచ్చు. ఎస్బీఐ ప్రభుత్వ రంగ బ్యాంక్ కావడంతో ఇన్వెస్ట్ చేసిన మొత్తానికి ఎలాంటి రిస్క్ ఉండదని చెప్పవచ్చు.