పోస్టాఫీస్ స్కీమ్స్ లో డబ్బులు ఇన్వెస్ట్ చేయాలని భావించే వాళ్లకు ప్రయోజనం చేకూరేలా ఎన్నో స్కీమ్స్ అందుబాటులో ఉన్నాయి. ఆ స్కీమ్స్ లో రికరింగ్ డిపాజిట్ స్కీమ్ కూడా ఒకటి కాగా ఈ స్కీమ్ ద్వారా తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు సొంతమవుతాయి. ప్రతి నెలా కొంత మొత్తం ఈ స్కీమ్ లో డిపాజిట్ చేయడం ద్వారా భారీగా లాభం పొందే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.
ఈ స్కీమ్ గడుపు ఐదేళ్లు కాగా ప్రతి నెలా ఈ స్కీమ్ లో 4,000 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే ఐదేళ్ల తర్వాత 3 లక్షల రూపాయలు పొందవచ్చు. నెలకు 10,000 రూపాయల చొప్పున పదేళ్లు ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేస్తే మాత్రం ఏకంగా 17 లక్షల రూపాయలు సొంతమవుతాయి. మొదట ఐదేళ్లు డిపాజిట్ చేసి ఆ తర్వాత టెన్యూర్ ను పెంచడం ద్వారా ఈ స్కీమ్ ద్వారా సులభంగా బెనిఫిట్ పొందే ఛాన్స్ అయితే ఉంటుంది.
ఇన్వెస్ట్ చేసే మొత్తం, చేసే కాలంను బట్టి పొందే మొత్తంలో మార్పులు ఉంటాయి. సమీపంలోని పోస్టాఫీస్ బ్రాంచ్ ద్వారా రికరింగ్ డిపాజిట్ స్కీమ్ గురించి మరిన్ని వివరాలను తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఈ స్కీమ్ లో డబ్బులు ఇన్వెస్ట్ చేసిన ఏడాది తర్వాత లోన్ పొందే ఛాన్స్ ఉంటుంది. రికరింగ్ డిపాజిట్ స్కీమ్ ద్వారా పిల్లల నుంచి పెద్దల వరకు ఎంతో ప్రయోజనం చేకూరనుంది.
రికరింగ్ డిపాజిట్ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేసిన వాళ్లు మెచ్యూరిటీ తర్వాతే డబ్బు పొందే అవకాశం అయితే ఉంటుంది. ఈ విషయాలను గుర్తు పెట్టుకుని ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేయాలి. దీర్ఘకాలంలో ఇన్వెస్ట్ చేయాలని భావించే వాళ్లకు భారీ లాభాలను అందించే స్కీమ్స్ లో ఈ స్కీమ్ ఒకటని చెప్పవచ్చు.