గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నిరుద్యోగులకు అదిరిపోయే తీపికబురు అందించింది. మెడికల్ ఫీల్డ్‌లో ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వాళ్లకు ప్రయోజనం చేకూరేలా ఈ జాబ్ నోటిఫికేషన్ వెలువడింది. ఫ్యాక్టరీ మెడికల్ ఆఫీసర్ ఉద్యోగ ఖాళీల కోసం ఈ జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ కాగా gailonline.com వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుంది.
ఆగష్టు నెల 20వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉందని సమాచారం అందుతోంది. hrdeptkhera@gail.co.in ఈమెయిల్ అడ్రస్ కు మెయిల్ చేయడం ద్వారా ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ఫ్యాక్టరీ మెడికల్ ఆఫీసర్ అని సబ్జెక్ట్ లైన్ లో మెన్షన్ చేసి ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవాలి.
గెయిల్ అధికారిక వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. నోటిఫికేషన్ ద్వారా అప్లికేషన్ ఫామ్ ను డౌన్ లోడ్ చేసుకుని ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఎలాంటి దరఖాస్తు ఫీజు లేకుండానే ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.
జనరల్ మెరిట్ ఆధారంగా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన ఎంపిక ప్రక్రియ జరగనుంది. ఎంబీబీఎస్ చదివిన వాళ్లు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకున్న వాళ్లు మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఆక్టపేషనల్ హెల్త్ సెంటర్ లో పని చేయాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వాళ్లకు 93,000 రూపాయల వరకు వేతనం లభించనుంది.