ప్రముఖ బ్యాంక్ లో 5000 ఉద్యోగ ఖాళీలకు నోటిఫికేషన్.. వేతనం ఎంతంటే?

Job-Vacancy

మన దేశంలోని ప్రముఖ బ్యాంక్ లలో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒకటనే సంగతి తెలిసిందే. తాజాగా ఈ బ్యాంక్ నుంచి 500 ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. దేశంలో ఉన్న వేర్వేరు సెంట్రల్ బ్యాంక్ శాఖలలో ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తారు. https://www.centralbankofindia.co.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది.

ఇప్పటికే ఈ ఉద్యోగాలకు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఆన్ లైన్ లో ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉండగా ఏప్రిల్ 3వ తేదీ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది. ఏప్రిల్ సెకండ్ వీక్ లో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు అప్రెంటిస్‌షిప్ రిక్రూట్‌మెంట్ టెస్ట్ జరుగుతుంది. అప్రెంటీస్ చట్టం 1961 ను అనుసరించి ఈ ఉద్యోగాల భర్తీ జరగనుంది.

గ్రాడ్యుయేట్ అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఈ ఉద్యోగాలకు సంబంధించి ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ లో 141 ఖాళీలు ఉండగా తెలంగాణలో 106 ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం వెంటనే దరఖాస్తు చేసుకుంటే మంచిదని చెప్పవచ్చు.

28 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. రిజర్వేషన్ల ఆధారంగా వయో పరిమితిలో సడలింపులు ఉంటాయి. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వాళ్లకు నెలకు 20,000 రూపాయల వరకు వేతనం లభిస్తుంది. https://www.centralbankofindia.co.in/sites/default/files/apprentice%20notification%20.pdf లింక్ ద్వారా ఈ ఉద్యోగాలకు సంబంధించి పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.