దేశానికి వెన్నెముకగా నిలిచిన రైతులను ఆదుకోవడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో పథకాలను అమలులోకి తీసుకువచ్చాయి. అతివృష్టి అనావృష్టి కారణంగా రైతులు నష్టపోతున్నారు. అంతేకాకుండా దళారుల చేతులలో మోసపోయి పంటకు సరైన గిట్టుబాటు లభించక ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నారు. ఈ క్రమంలో రైతులను ఆర్థికంగా ఆదుకోవడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో పథకాలను అమలులోకి తీసుకువచ్చాయి. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ యోజన పథకం ద్వారా ఇప్పటికే ఏడాదికి 6000 రూపాయల ఆర్థిక సహాయం అందిస్తోంది. అలాగే రైతుల ఆదాయాన్ని పెంచేందుకు కూడా కేంద్రం కొన్ని స్కీమ్స్ ని అమలులోకి తీసుకువచ్చింది.
అలాగే వ్యవసాయ యంత్రాలపై సబ్సిడీ, ఎరువులు, విత్తనాలపై సబ్సిడీ మొదలైన స్కీమ్స్ ని కూడా కేంద్రం ఇస్తోంది. ఇక ఇటీవల ప్రధాన మంత్రి కుసుమ్ పథకం ని కూడా అమలులోకి తీసుకు వచ్చింది . ఈ స్క్రీన్ ద్వారా రైతులకు సోలార్ పంపులను అమర్చుకునే సదుపాయాన్ని కేంద్ర ప్రభుత్వం కల్పిస్తోంది. సాధారణంగా పొలంలో విద్యుత్ శక్తిని ఉపయోగించి మోటార్లు నడుపుతుంటారు. విద్యుత్తుతో నడిచే మోటార్లకు అధిక ఖర్చు ఉంటుంది. అందువల్ల కేంద్ర ప్రభుత్వం రైతులకు సోలార్ పంపులు అమర్చుకునే సదుపాయాన్ని కల్పించింది. కుసుమ్ యోజన కింద రైతులు సౌర శక్తిని ఉపయోగించడం వలన తక్కువ ఖర్చు తో మంచి పంటలు వస్తాయి.
అయితే రైతులు తమ భూమి లో సోలార్ ప్యానెల్స్‌ను ఏర్పాటు చేసుకోవడంలో కేంద్ర ప్రభుత్వం తమ వంతు సహాయం అందిస్తోంది. పొలంలో సోలార్ ప్యానల్స్ ఏర్పాటు చేయటానికి రైతులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 60 శాతం వరకు సబ్సిడీ ఇస్తున్నారు. అంతేకాకుండా 30 శాతం బ్యాంకు ద్వారా రుణం వస్తుంది. దీంతో రైతులు తక్కువ ఖర్చుతో సోలార్ ప్యానెల్స్ పొలంలో ఏర్పాటు చేసుకోవచ్చు . కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ కుసుమమ్ యోజన స్కీం కి సంబంధించిన పూర్తి వివరాలను అధికారిక వెబ్‌సైట్ https://www.india.gov.in/ ద్వారా తెలుసుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ స్కీం ద్వారా రైతులకు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.