అయ్యయ్యో : ఒకే ఒక్క ట్విట్ .. లక్ష కోట్లు ఫట్ !

అమెరికన్‌ విద్యుత్‌ కార్ల కంపెనీ టెస్లా అధిపతి ఎలాన్‌ మస్క్‌..ట్విటర్‌లో తరచూ ఏదో ఒక అంశంపై ట్వీట్‌ చేస్తూనే ఉంటాడు. క్రిప్టో కరెన్సీలైన బిట్‌కాయిన్‌, ఎథర్‌ విలువ చాలా అధిక స్థాయిలో ఉందంటూ గత వారాంతంలో చేసిన ట్వీట్‌.. ఆయన కొంపముంచింది. ఆ ఒక్క ట్వీట్‌ కారణంగా అమెరికా మార్కెట్లో టెస్లా షే రు సోమవారం 8.6 శాతం నష్టపోయింది.

elon musk: Elon Musk loses $15 billion in a day after Bitcoin warning - The  Economic Times

గత ఏడాది సెప్టెంబరు తర్వాత టెస్లా షేరుకు ఇదే అతిపెద్ద క్షీణత. దాంతో మస్క్‌ వ్యక్తిగత సంపద 1,520 కోట్ల డాలర్ల (రూ.1.10 లక్షల కోట్ల పైమాటే) మేర పతనమై 18,340 కోట్ల డాలర్లకు పడిపోయింది. పర్యవసానంగా, ఆయన ప్రపంచ కుబేర కిరీటాన్నీ కోల్పోవాల్సి వచ్చింది. అమెజాన్‌ చీఫ్‌ జెఫ్‌ బెజోస్‌ 18,630 కోట్ల డాలర్ల ఆస్తితో మళ్లీ అగ్రస్థానానికి చేరుకున్నారు.

అయితే, మస్క్‌ ట్వీట్‌ కు.. టెస్లా షేర్ల పతనానికి సంబంధమేంటి అంటారా..? బిట్‌కాయిన్స్‌లో 150 కోట్ల డాలర్లు ఇన్వెస్ట్‌ చేసినట్లు రెండు వారాల క్రితం టెస్లా ప్రకటించింది. అంతేకాదు, త్వరలో బిట్‌కాయిన్‌ చెల్లింపులనూ స్వీకరిస్తామని తెలి పింది. దీంతో బిట్‌కాయిన్‌ విలువ 50,000 డాలర్లు దాటింది. భారీ మొత్తంలో బిట్‌కాయిన్‌ ఆస్తులను కలిగి ఉన్న మస్క్‌.. తాజాగా ఆ కరెన్సీ విలువపై సందేహాలు లేవనెత్తడం టెస్లా షేరు పతనానికి ప్రధాన కారణమైంది.