HomeHoroscopeToday Horoscope : ఫిబ్రవరి 4th బుధవారం మీ రాశి ఫ‌లాలు

Today Horoscope : ఫిబ్రవరి 4th బుధవారం మీ రాశి ఫ‌లాలు

మేష రాశి : ఈరోజు అప్రమత్తంగా ఉండండి !

ఉన్నతాధికారుల వలన మీకు ప్రశంసలు లభిస్తాయి. ఈరోజు శ్రమకు ఫలితం కనిపిస్తుంది. మీ తల్లితండ్రులు మిమ్మల్ని చూసి గర్విస్తారు. భూములు, వాహనాలు కొంటారు. వాహనాలు నడిపే సమయంలో అప్రమత్తం గా ఉండండి. శుభవార్తలు వింటారు. ఈరోజు లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్ర పారాయణం చేసుకోండి.

వృషభ రాశి: వ్యాపారాలు నిరాశ పరుస్తాయి !

ఈరోజు వ్యవహారాలు ముందుకు సాగవు. ఈరోజు సానుకూలంగా గడుస్తుంది. వ్యాపారాలు నిరాశ పరుస్తాయి. మీ ఆర్థిక స్థితిగతి పెరుగుతుంది. నిర్ణయాలు తీసుకునే సమయంలో జాగ్రత్తగా ఉండండి. శ్రమాధిక్యం. ఈరోజు రామ రక్షా స్తోత్రం పారాయణం చేసుకోండి. శ్రీ వెంకటేశ్వర గోవింద నామ పారాయణం చేసుకోండి.

మిధున రాశి: ఈరోజు శుభవార్తలు వింటారు !

ఈరోజు మీకు ఆహ్లదకరంగా గడుస్తుంది. ప్రయాణాలు వాయిదా. సోదరభావం పెరుగుతుంది. ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకుంటారు. ఈరోజు పనుల్లో అవాంతరాలు. అసంపూర్ణంగా ఉన్న పనులను పూర్తి చేసుకుంటారు. శుభవార్తలు వింటారు. వ్యాపారాలు అంతగా లాభించవు. ఈరోజు స్నేహితుడ్ని కలుస్తారు. లలితా సహస్రనామ పారాయణం చేసుకోండి.

కర్కాటక రాశి: ఈరోజు కార్యాలయంలో అనుకూలం !

సభలు, సమావేశాలలో పాల్గొంటారు. ఈరోజు మీరు ఇతరులకు సాయం చేస్తారు. సంతోషంగా ఉంటారు. కార్యాలయం లో మీకు అనుకూలంగా మార్పులు జరగడం మీకు సంతోషాన్ని ఇస్తుంది. పాతబాకీలు అందుతాయి. మీ ప్రవర్తన ద్వారా మీ సహోద్యోగుల్లో మార్పులు తీసుకొస్తారు. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగుతాయి. దక్షిణామూర్తి స్తోత్రం పారాయణం చేసుకోండి.

Today February 4Th 2021 Daily Horoscope In Telugu
today february 4th 2021 daily horoscope in telugu

సింహ రాశి: ఉద్యోగాలలో చికాకులు !

ఈరోజు సంతోషంగా ఉంటారు. పనుల్లో ఆటంకాలు. ఆలయాలు సందర్శిస్తారు. ఆగిపోయిన పనులను తిరిగి పూర్తి చేస్తారు. ఆహరం విషయంలో శ్రద్ధ వహించండి. ఆరోగ్య విషయంలో ఇబ్బందిపడాల్సి వస్తుంది. ఈరోజు ఉద్యోగాలలో చికాకులు. శ్రీ సుబ్రహ్మణ్య అష్టకం పారాయణం చేసుకోండి.

కన్య రాశి: ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు !

ఈరోజు వ్యాపారం కలిసి వస్తుంది. కొత్త విషయాలు తెలుసుకుంటారు. గతంలో కంటే ఈరోజు ఆర్ధిక పరిస్థితి బాగుంటుంది. పరిచయాలు పెరుగుతాయి. సాయంత్రం సమయం లో మీరు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. లలితా చాలీసా పారాయణం చేసుకోండి.

తుల రాశి: కుటుంబ సభ్యులతో విభేదాలు !

ఈరోజు ఆర్ధికంగా బలంగా ఉంటుంది. పనులు నిదానంగా సాగుతాయి. మీ మాటలపై సంయమనం పాటించకపోతే ఇబ్బందులు. కుటుంబ సభ్యులతో విభేదాలు. ఈరోజు వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఈరోజు మీ స్నేహితుడిని కలవడం మీకు సంతోషాన్ని కలిగిస్తుంది. లక్ష్మి అష్టోత్తర పారాయణం చేసుకోండి.

వృశ్చిక రాశి: సమస్యలను పరిష్కరించుకుంటారు !

ఈరోజు నూతన ఉద్యోగాలు పొందుతారు.ఇంటి సమస్యలను పరిష్కరించుకుంటారు. కుటుంబంతో ఆనందంగా గడుపుతారు. భూవివాదాల పరిష్కారం. ఈరోజు అనుకోని విధంగా కలిసి వస్తుంది. శుభవార్తలు వినే సూచనలు ఉన్నాయి. ఈరోజు పనులు సకాలంలో పూర్తి. విష్ణుసహస్రనామ పారాయణం చేసుకోండి.

ధనుస్సు రాశి: ఆదాయ వనరులను సృష్టించుకుంటారు !

ఈరోజు పోటీ రంగంలో ప్రత్యేకంగా ఉంటుంది. కుటుంబంలో శుభకార్యాలు. కొత్త ఆదాయ వనరులను సృష్టించుకుంటారు. ఈరోజు మీరు ఎంచుకున్న రంగంలో గౌరవాన్ని పొందుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఈరోజు ఆరోగ్యం పై ప్రతికూల ప్రభావం పదుతుంది. వ్యాపారాలు విస్తరిస్తారు. హయగ్రీవ అష్టోత్తర పారాయణం చేసుకోండి.

మకర రాశి: ఆలోచనలు స్థిరంగా ఉండవు !

ఈరోజు ఎక్కువగా ఖర్చులు అవుతాయి. మిత్రులతో కలహాలు. మీ బంధువులు లేదా సహోద్యోగుల కారణంగా ఒత్తిడి పెరుగుతుంది. ఈరోజు ఆలోచనలు స్థిరంగా ఉండవు. డబ్బు లావాదేవీల విషయం లో మీరు అనేక జాగ్రత్తలు పాటించాలి. దేవాలయాలు సందర్శిస్తారు. ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేసుకోండి.

కుంభ రాశి: కుటుంబంలో స్వల్ప వివాదాలు !

ఈరోజు మిత్రులను కలుసుకుంటారు.వైవాహిక జీవితం బాగుంటుంది. ఎక్కువ దూరం ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. కుటుంబంలో స్వల్ప వివాదాలు. ఈరోజు మీ పాత స్నేహితులను కలవడం వలన సంతోష పడతారు. తల్లి తండ్రుల సలహాలు, ఆశీర్వాదాలు మీకు మరింత మేలు చేకూరుస్తాయి. వ్యాపారులకు స్వల్ప లాభాలు. కనకధారా స్తోత్ర పారాయణం చేసుకోండి.

మీన రాశి: ఈరోజు వివాదాల నుంచి బయటపడతారు !

ఈరోజు శారీరక ఇబ్బందులు ఎక్కువ అవుతాయి. పరిచయాలు పెరుగుతాయి. జీవిత భాగస్వామికి దూరంగా ఉండాల్సి రావచ్చు. ఈరోజు స్థిరాస్తి వివాదాల నుంచి బయటపడతారు. ఆదాయం పెరుగుతుంది. పెట్టుబడులు పెట్టేముందు అన్ని విషయాలను క్షుణ్ణంగా పరిశీలించండి. శ్రీ వెంకటేశ్వర అష్టోత్తర పారాయణం చేసుకోండి.

Related Posts

Gallery

Most Popular

Polls

Latest News