గాసిప్స్ : “SSMB 28” ఈ విషయంలో మహేష్ వెనక్కి తగ్గట్లేదట..!

టాలీవుడ్ బిగ్ స్టార్స్ లో ఒకరైన సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో తన కెరీర్ లో మరో భారీ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇది మహేష్ బాబు కెరీర్ లో 28వ సినిమాగా తెరకెక్కనుండగా రీసెంట్ గానే సినిమా రిలీజ్ డేట్ ని కూడా చిత్ర యూనిట్ అనౌన్స్ చేసేసారు.

అయితే ఈ సినిమా విషయంలో మహేష్ బాబు కి అలాగే నిర్మాతలకి మధ్య చిన్న లైన్ ఇప్పుడు ఏర్పడినట్టుగా గాసిప్స్ వినిపిస్తున్నాయి. ఈ చిత్రాన్ని ఎలాగో 200 కోట్లతో ప్లాన్ చేస్తుండగా పాన్ ఇండియా రిలీజ్ చేస్తే బాగుంటుంది అని తెలుపగా మహేష్ అయితే ఈ ప్లాన్ కి నో చెప్తున్నాడట.

ఈ సినిమా పాన్ ఇండియా రిలీజ్ వద్దని ససేమిరా అంటున్నాడట. దీనితో హిందీ రిలీజ్ వరకు అయినా ప్లాన్ చేద్దామని అనుకుంటున్నారట కానీ మహేష్ మాత్రం తన పాన్ ఇండియా ఎంట్రీ కేవలం రాజమౌళి సినిమాతోనే ఉండాలని బలంగా ఫిక్స్ అయ్యాడట.

అందుకే ముందే పాన్ ఇండియా సినిమాగా అనౌన్స్ చేసిన ఈ చిత్రాన్ని ఇప్పుడు కేవలం తెలుగులో మాత్రమే చేసేలా మహేష్ ప్రెజర్ చేస్తున్నాడట. దీనితో అయితే ఈ చిత్రం రిలీజ్ విషయంలో మహేష్ కి నిర్మాతలకి కాస్త ఇబ్బంది ఉన్నట్టు తెలుస్తుంది. మరి లాస్ట్ కి అయితే ఎవరిది పైచేయి అవుతుందో చూడాలి.