రాజ్యసభ డిప్యూటీ స్పీకర్ ఎన్నిక సందర్భంగా చోటుచేసుకున్న పరిణామాలు రాజకీయాలు ఎంత అవకాశవాదంగా తయారయ్యాయనేది మరోసారికళ్లకు కట్టినట్లు చూపించాయి. అయితే ఈసారి ఆ ఘనకార్యాన్ని ఆవిష్కరించింది ఆంధ్రప్రదేశ్ కు చెందిన రెండు రాజకీయ పార్టీలే. అదేమిటంటే కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపికి ఇటు వైసిపి గాని, అటు తెలుగుదేశం గాని రెండూ అధికారికంగా భాగస్వామ్య పార్టీలో లేక మిత్రపక్షాలో కానే కాదు. ఇంకా చెప్పాలంటే ఒక రకంగా శత్రుపక్షపార్టీలే. ఎందుకంటే రాష్ట్రంలో ఆయా పార్టీలు ఒకదానితో ఒకటి వ్యవహరించే తీరు అలాగే ఉంటుంది. అయితే అవసరమైనచోట రాజకీయపార్టీలు సిద్దాంతాలు-రాద్ధాంతాలు అంటూ లేకుండా ఎంతగా కలసిపోతాయనేది ఈసారి అందరికీ తెలిపోయేటట్లు చేసింది రాజ్య సభ డిప్యూటీ స్పీకర్ ఎన్నిక.ఈ మొత్తం ఎపిసోడ్ లో చంద్రబాబు వ్యవహారమే మరీ ఘోరం.
ఇక్కడ ఆ మూడు బద్ద శత్రువులు
ఏపీలో వైకాపా-టీడీపీ-బిజెపి మూడు పార్టీలు బద్ధశత్రువులు. అలా అని వారే తమ విమర్శలు, ఆరోపణల ద్వారా పదే పదే ప్రజలకు అర్థం అయ్యేలా చేస్తుంటారు. అంతేకాదు తమది కేవలం రాజ్యాధికారం కోసమే సాగే పవర్ ఫైటింగ్ కాదని సిద్దాంతాల వైరుధ్యం కూడా ఎంతో ఉందన్నట్లుగా మూడు పార్టీలు బిల్డప్ ఇస్తుంటాయి. తమ పార్టీ మాత్రమే ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పోరాటం చేస్తున్నట్లు కలరింగ్ ఇస్తాయి. కానీ ఈ పార్టీలన్నీ అవకాశవాదులని…ఒకే తానులో ముక్కలని తేల్చి చెప్పే ఘట్టం తాజాగా ప్రజల మందు ఆవిష్కృతమయింది. అదే రాజ్యసభలో డిప్యూటీ చైర్మన్ ఎన్నిక. అక్కడ ఎన్నిక సందర్భంగా ఏం జరిగిందో చెప్పుకునే ముందు అంతకుముందు ఏం జరిగిందో చెప్పుకుందాం.
ఒకప్పుడు అలా…
ఎపిలో నువ్వు వెధవ అంటే నువ్వు వెధవన్నర వెధవ అనుకునే వైసిపి-టిడిపి రాష్ట్రంలో తమ ఉమ్మడి శత్రువైన బిజెపిని చీల్చిచెండాడే ప్రయత్నం చేస్తూనే (లేదా అలా నటిస్తూనే) కేంద్రంలో మాత్రం ఆ పార్టీకి నేను నీకు మద్దతిస్తా అంటే నేను నీకు మద్దతిస్తానని పోటీలు పడుతున్నాయి. సరే వీళ్లంటే కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి సహకారం ఎంతైనా అవసరమని అలా చేశారని అనుకుందాం…కానీ బిజెపి కూడా సిద్దాంతాలు-పాలసీలు అనేవి లేకుండా ఇదే మాకు కావాల్సింది అనుకుంటూ మద్దతు తీసుకొంటుంటాయి. ఈ సందర్భంగా ఇప్పుడో పాత విషయాన్ని ఒక్కసారి గుర్తు చేసుకుందాం.1998లో జరిగిన ఎన్నికల్లో ఎన్డీయే కూటమి మద్దతుతో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. వాజ్‌పేయి రెండోసారి ప్రధాని అయ్యారు. అయితే పూర్తి మెజారిటీ లేనందున బల నిరూపణ అవసరమైన స్థితిలో జయలలిత మద్దతు ఉపసంహరించుకోవడంతో 1999 ఏప్రిల్ 17న ఒక ఓటు తేడాతో వాజ్ పేయి ప్రభుత్వం ఓడిపోయి రాజీనామా చేయాల్సి వచ్చింది. నిజానికి అప్పుడు వాజ్ పేయి తల్చుకుంటే ఆ ఒక్క ఓట కాదు ఇంకా అదనంగా ఎన్నో ఓట్లు కూడగట్టగలిగేవారు.
మరిప్పుడు…ఆ స్టయిలే వేరు
సరే తాజాగా జరిగిన రాజ్యసభలో డిప్యూటీ చైర్మన్ ఎన్నిక ప్రక్రియ చూస్తే సభలోని 245 మంది సభ్యుల్లో బిజెపి నేతృత్వంలోని ఎన్డీఏ బలం 113 మాత్రమే. అంటే మామూలుగా అయితే ఎన్డిఎ నిలబెట్టిన అభ్యర్ధి గెలవడం సాధ్యం కాదని ప్రాధమిక లెక్కలు తెలిసిన సామాన్యుడికైనా తెలిసిపోతుంది. కానీ ఇప్పుడు ఎన్డియే సారధులు ఎవరు గుండెలుతీసిన బంటుల్లాంటి మోదీ-అమిత్‌షా. గెలుపే ప్రధానం తప్ప సిద్దాంతాలు-రాద్దాంతాలు ముఖ్యం కాదనుకునే టైపు. అందుకే రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికలో ఎన్డిఎ క్యాండిడేట్ హరివంశ్ నారాయణ్ సింగ్ రెండోసారి కూడా ఈజీగా గెలిచారు. అదెలా అంటే అదిగో అక్కడే మన తెలుగు పార్టీలైన వైసిపి-టిడిపి టాలెంట్ వారికి ఉపయోగపడింది. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికల్లో ఎన్డిఎ అభ్యర్ధికి వైసిపి అన్ని పార్టీల కంటే ముందే బేషరుతుగా తమ మద్దతు ప్రకటించింది. అయితే ఇక్కడ వైసిపిని కనీసం బిహార్ సిఎం నితీష్ కుమార్ ఫోన్ చేసి తమ పార్టీ అభ్యర్థికి మద్దతివ్వమని అడిగారు.పైగా రాష్ట్ర అవసరాల కోసం కేంద్రంతో సఖ్యత కోసమని అనుకోవచ్చు. కానీ ఈ ఎన్నిక సందర్భంగా టిడిపి అధినేత చంద్రబాబు వ్యవహరించినా తీరే మరీ దారుణం.
చంద్రబాబు తీరే చర్చనీయాంశం
రాజకీయాల్లో అందరికంటే సీనియర్ ని…మోడీ కంటే అనుభవజ్ఞుడిని…గతంలో కేంద్రంలో చక్రం తిప్పా…ప్రధానులను…రాష్ట్రపతులను నేనే సెలక్ట్ చేశానని చెప్పుకునే చంద్రబాబును బిజెపి కాదు కదా ఏ పార్టీ నేత ఫోన్ తమకి మద్దతు ఇవ్వాలని అడగనే లేదు. అయినా సరే చంద్రబాబు ఏం మొహమాటకుండా కేంద్రంలో ఎన్డీఏ అభ్యర్థఇకే తమ మద్దతని బహిరంగంగా ప్రకటించేశారు. అయితే ఇక్కడే చంద్రబాబ…