ఆ పాపకి బన్నీ మీదనే ఆశలున్నాయట.!

ఏమయ్యింది కేతిక శర్మ.? ఏమవుతుంది.? ఏమీ అవదు.! ప్రస్తుతానికైతే ఖాళీగానే వుంది. అప్పుడెప్పుడో ‘రొమాంటిక్’ అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయమై, పంజా వైష్ణవ్ తేజ్ సరసన ‘రంగ రంగ వైభవంగా’ సినిమాలో కనిపించిన కేతిక కెరీర్ ఇప్పుడు అయోమయంలో పడింది.

ఏవో రెండు మూడు ప్రాజెక్టులు చర్చల దశలో వున్నాయట. ఓ సినిమా ప్రస్తుతం నిర్మాణంలో వుందట.! అంతేనా.? స్టార్ హీరోయిన్ అవ్వాల్సిన కేతిక.. ఎందుకిలా.?

ఏమోగానీ, కేతిక గురించి ఓ గాసిప్ ప్రచారంలో వుంది. అదేంటంటే, ఈ బ్యూటీ.. ‘పుష్ప’ హీరో అల్లు అర్జున్‌తో టచ్‌లో వుందట. ఆ మధ్య ‘ఆహా’ కోసం ఈ ఇద్దరూ ఓ ప్రకటనలో కనిపించారు లెండి. అప్పటినుంచీ ఆ స్నేహం కంటిన్యూ అవుతోందట.

‘పుష్ప’లోనో, మరో సినిమాలోనో అల్లు అర్జున్‌తో కలిసి ఓ సీన్‌లో అయినా.. స్పెషల్ సాంగ్‌లో అయినా కనిపిస్తానని చెప్పుకుంటోందిట. అంత ఆశతో వుందంటే, ఆ ఆశ పెట్టింది అల్లు అర్జునేనా.?