అశ్వనీదత్ కు దిమ్మతిరిగే కౌంటరేసిన తలసాని!

నంది అవార్డుల విషయంలో ఏపీ సర్కార్ పై సినీ నిర్మాత అశ్వనీదత్ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఉత్తమ రౌడీ, ఉత్తమ గుండా అవార్డులు ఇస్తున్నారని… మరో రెండు మూడేళ్ల తర్వాత నంది అవార్డులు ఇస్తారని… చంద్రబాబు రాకను కాంక్షిస్తూ, జగన్ పై తన అక్కసును అలా వెళ్లగక్కారు అశ్వనీదత్. అయితే ఈ విషయాలపై తాజాగా స్పందించారు తెలంగాణ మంత్రి తలసాని.

తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.. నంది అవార్డుల విషయంలో కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఏడాది నుంచి అవార్డులు ఇస్తామని ప్రకటించారు. తెలుగు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత నంది అవార్డులు ఇచ్చే విషయంలో ఆలస్యం జరిగినమాట వాస్తవమేనని మంత్రి తలసాని అంగీకరించారు. అయితే ఈ అవార్డుల గురించి ఎవరు పడితే వారు మీడియా ముందు మాట్లాడటం సరికాదని, సంబంధిత శాఖ దృష్టికి సమస్య తీసుకు రావాలని చురకలంటించారు.

అనంతరం మరింతగా సెటైర్స్ వేసిన ఆయన… మీడియాని చూస్తే అత్యుత్సాహంతో కొంతమందికి మాటలు వచ్చేస్తాయని.. ఏమి మాట్లాడుతున్నామన్న సోయ కోల్పోతారని అన్నారు. ఇక, అవార్డుల విషయంలో తెలంగాణ ప్రభుత్వానికి ఇప్పటివరకూ ఎలాంటి ప్రతిపాదనలు రాలేదని తలసాని స్పష్టం చేశారు. ఎవరు పడితే వారు అడిగితే అవార్డులిచ్చేస్తారా అని సూటిగా ప్రశ్నించారు.

దీంతో… అవార్డుల విషయంలో ప్రతిపాదనలు పంపకుండానే అశ్వనీదత్ ప్రేళాపనలు ఎందుకంటూ సెటైర్స్ వేస్తున్నారు నెటిజన్లు. ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ ఉన్న తెలంగాణ ప్రభుత్వం ఇవ్వకపోయినా నోరు మెదపని అశ్వనీదత్… ఏపీ ప్రభుత్వంపై మాత్రం అవాకులు చెవాకులూ పేలుతూ తన అక్కసు వెళ్లగక్కుతున్నారన్ని కామెంట్స్ చేస్తున్నారు.

కాగా… అశ్వనీదత్ వ్యాఖ్యలపై స్పందించిన పోసాని కృష్ణమురళి… “ఉత్తమ రౌడీ, ఉత్తమ గూండా కాదు…. ఉత్తమ వెన్నుపోటు దారుడు, ఉత్తమ దగుల్బాజీ వంటి అవార్డులు ఇవ్వాలని, ఎన్టీఆర్ ముఖంపై కరెక్టుగా చెప్పు విసిరిన వాడికి.. ఉత్తమ గురిగాడు అవార్డ్ ఇవ్వాలని సూచిస్తూ ఫైర్ అయిన సంగతి తెలిసిందే!