షారుక్ ఖాన్ తదుపరి చిత్రంలో రామ్ చరణ్.?

సౌత్, నార్త్ అన్న బౌండరీస్ చెరిగిపోయాయ్.! ‘మనదంతా ఒకటే సినీ పరిశ్రమ.. అదే భారతీయ సినీ పరిశ్రమ..’ అంటోంది బాలీవుడ్. తెలుగు సినిమా, తమిళ సినిమా, కన్నడ సినిమా, మలయాళ సినిమా కూడా.. ఇప్పుడు అదే భావనలో కనిపిస్తున్నాయ్.

అన్నీ పాన్ ఇండియా సినిమాలే అన్నట్లు తయారైంది వ్యవహారం. అలాగని ప్రాంతీయ సినిమా లేదా.? అంటే, ఎందుకు లేదు.. ఆ ప్రాంతీయ సినిమానే ఇప్పుడు జాతీయ సినిమా అవుతోంది.

మరీ ముఖ్యంగా బాలీవుడ్ సినిమా, సౌత్ నుంచి మద్దతు కోరుకుంటోంది. ఈ క్రమంలో సౌత్ హీరోల్ని బాలీవుడ్ తమవైపుకు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తోంది. కాగా, బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్, తన తదుపరి సినిమా కోసం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తో సంప్రదింపులు జరుపుతున్నాడట.

షారుక్ – చరణ్ మధ్య ఎప్పటినుంచో సన్నిహిత సంబంధాలున్నాయి. ఈ నేపథ్యంలోనే, తన సినిమాలో గెస్ట్ రోల్ చేయాల్సిందిగా షారుక్, చరణ్‌ని అడిగేశాడట.

అన్నీ అనుకున్నట్లు జరిగితే సంక్రాంతి తర్వాతే ఈ ప్రాజెక్టుపై కీలక ప్రకటన వుండబోతోందని సమాచారం. నలభై నిమిషాలకు పైగా నిడివి వుండే పవర్ ఫుల్ రోల్ కోసం, బాలీవుడ్ వైపు చూడకుండా షారుక్, నేరుగా రామ్ చరణ్‌తో చర్చలు జరపడం గమనార్హం.