(చిత్రం : ఊరు పేరు భైరవకోన, విడుదల : 16, ఫిబ్రవరి -2024, రేటింగ్ : 2.75/5, నటీనటులు: సందీప్ కిషన్, వర్ష బొల్లమ్మ, కావ్య థాపర్, వెన్నెల కిషోర్, హర్ష చెముడు, పి. రవిశంకర్ తదితరులు. నిర్మాణం: హాస్య మూవీస్, ఏకే ఎంటర్టైన్మెంట్ , దర్శకత్వం : వీఐ ఆనంద్ఎం, నిర్మాత: రాజేశ్ దండా, సంగీత దర్శకులు: శేఖర్ చంద్ర, సినిమాటోగ్రఫీ: రాజ్ తోట, ఎడిటింగ్: ఛోటా కె ప్రసాద్).
కథానాయకుడు సందీప్ కిషన్ తాజా చిత్రం ‘ఊరు పేరు భైరవకోన’. వి. ఐ ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కావ్య థాపర్, వర్ష బొల్లమ్మ హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా ఈ రోజు (16, ఫిబ్రవరి -2024) విడుదల అయింది. మరి ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో తెలుసుకుందాం….
కథ : తన స్నేహితుడు జాన్ (వైవా హర్ష)తో కలిసి బసవ (సందీప్ కిషన్) ఓ దొంగతనం చేస్తాడు. ఈ క్రమంలో పోలీసుల నుంచి తప్పించుకుంటూ అనుకోకుండా భైరవకోన అనే ఊరిలోకి అడుగుపెడతారు. ఐతే, ఈ ఇద్దరితో పాటు గీత ( కావ్య థాపర్) కూడా ఆ ఊర్లోకి వస్తోంది. ఇంతకీ, ఆ భైరవకోన ఊరు ప్రత్యేకత ఏమిటి ?, అక్కడ కనిపించే ప్రజలు ఎవరు?, ఈ మధ్యలో బసవ – జాన్ – గీత.. ఆ భైరవకోనలో ఎలాంటి విచిత్ర పరిస్థితులను ఎదుర్కొన్నారు?, మొత్తంగా ఈ ముగ్గురి జీవితాలు భైరవకోనలో ఎలాంటి మలుపులు తిరిగాయి?, ఈ మొత్తం వ్యవహారంలో వర్ష బొల్లమ్మ పాత్ర ఏమిటి ?, ఇంతకీ, గరుడ పురాణం లో మిస్ అయిన నాలుగు పేజీలకు – భైరవకోనకి మధ్య ఉన్న సంబంధం ఏమిటి ? సినిమా ఇండస్ట్రీలో స్టంట్ మాస్టర్‌గా పనిచేసే బసవలింగం పెళ్లి ఇంటిలో వధువు నగలు దొంగతనం చేసి మిస్టీరియస్‌గా ఉండే భైరవకోన అనే గ్రామంలోకి ప్రవేశిస్తారు. భైరవకోన విలేజ్‌లోకి ప్రవేశించడానికి ముందు భూమి, గీత ( ఎదురుపడుతారు. గ్రామంలోకి వెళ్లిన బసవలింగంకు ఎదురైన విచిత్ర పరిస్థితుల మధ్య దోచుకొన్న బంగారాన్ని అక్కడి వ్యక్తులు కొట్టేస్తారు. అక్కడ కనిపించిన భయంకర పరిస్థితుల నుంచి బయటపడుతారు. కానీ బంగారాన్ని తెచ్చుకోవడానికి మళ్లీ భైరవకోనకు వెళ్తారు. స్టంట్ మాస్టర్‌గా పనిచేసే బసవలింగం ఎందుకు దొంగలా మారాడు? భారీగా డబ్బును ఎందుకు కూడబెట్టాలని అనుకొంటాడు? దొంగతనాలకు పాల్పడే గీత కలిసిన తర్వాత వారి ప్రయాణం ఎలా సాగింది? తన స్నేహితుడు జాన్ వల్ల బసవలింగం ఎలాంటి పరిస్థితుల్లో ఇరుక్కుపోయాడు? భూమికి బసవకు ఉన్న రిలేషన్ ఏమిటి? భూమి కోసం బసవ జీవితాన్ని రిస్క్‌లో పడేసుకొన్నాడు? భైరవకోనకు గరుడపురాణానికి సంబంధం ఏమిటి? బసవ తాను అనుకొన్న లక్ష్యాన్ని చేరుకొన్నాడా? అనే ప్రశ్నలకు సమాధానమే ఊరు పేరు భైరవకోన.
విశ్లేషణ: దెయ్యాలు, ఆత్మలు కథలు తెలుగు సినిమాకి కొత్తేమీ కాదు. దీనికి తోడు, ‘భైరవకోన’లోని హారర్ ఎఫెక్ట్స్ కూడా బాగా రెగ్యులర్ అయిపోయాయి. కథలో ఎంత కల్పన అయినా ఉండొచ్చు. కానీ, కథే పూర్తి కల్పన అయితే, ఆ కల్పనలో అబ్బురపరిచే విషయాలు ఉండాలి, నమ్మశక్యం కానీ సంఘటనలను కూడా నమ్మేలా చిత్రీకరించాలి. కానీ, ఈ ‘ఊరు పేరు భైరవకోన’ సినిమాలో అది కాస్త నిరాశ కలిగించింది. ముఖ్యంగా హీరోయిన్ పాత్ర చనిపోయే సన్నివేశం మరీ సిల్లీగా అనిపిస్తోంది. భైరవకోనలో జరిగే కొన్ని సంఘటనల మధ్య సందీప్ కిషన్ దొంగతనం చేసే సన్నివేశాలతో మూవీ ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. దర్శకుడు ఏదో కొత్త కథ చెప్పబోతున్నాడనే ఫీలింగ్ అయితే కల్పించాడు. కథా ప్రయాణంలో కొన్ని చిక్కు ముడులను ప్రేక్షకుల ముందు ఉంచి ఆసక్తిని రేకెత్తించడంలో సక్సెస్ అయ్యాడు. తన కథకు తగినట్టుగా క్రియేట్ చేసిన ఓ కొత్త ప్రపంచం థ్రిల్లింగ్‌గా అనిపిస్తుంది. ఆ ప్రపంచంలో జరిగే సంఘటనలకు వీఎఫ్ఎక్స్ జోడించి కొత్త అనుభూతిని పంచే ప్రయత్నం కూడా బాగుంది. కానీ బలమైన కథ లేకుండా, ఎమోషనల్ కంటెంట్ లేకుండా ఫస్టాఫ్‌లో రిస్క్ చేశాడనే ఫీలింగ్ కలుగుతుంది. దర్శకుడు ఫస్ట్ హాఫ్ పై ఆసక్తిని కలిగించే ప్రయత్నం చేసినప్పటికీ… అదే విధంగా అతను రాసుకున్న కాన్సెప్ట్ బాగున్నప్పటికీ.. సినిమాలో చాలా చోట్ల లాజిక్ తో పాటు ఇంట్రెస్ట్ కూడా మిస్ కావడం, మరియు బోరింగ్ ప్లే ఎక్కువ అవ్వడం వంటి అంశాల కారణంగా ఈ సినిమా అంతగా ఆకట్టుకోలేపోయింది.
మరణించిన వారి ఆత్మలు ద్వేషంతో రగిలిపోతూ.. పగ కోసం పరితపిస్తోంటే.. ఎలా ఉంటుంది? అనే కాన్సెప్ట్ తో వచ్చిన ఈ ఎమోషనల్ హారర్ రివేంజ్ డ్రామాలో కొన్ని ఎమోషన్స్ అండ్ మెయిన్ కథాంశం ఆకట్టుకుంది. ఈ సినిమాలో ప్రధాన పాత్ర అయిన బసవ పాత్ర .. ఆ పాత్రకి సంబంధించిన ఎమోషనల్ ట్రాక్.. అలాగే ఆ పాత్రతో ముడి పడిన వర్ష బొల్లమ్మ పాత్ర.. ఆమెకు జరిగిన అన్యాయం, దానికి సందీప్ కిషన్ చేసే రిస్క్.. ఇలా మొత్తానికి ‘ఊరు పేరు భైరవకోన’ సినిమా కొన్ని చోట్ల ఆసక్తిగొలిపింది. అలాగే ఈ ‘ఊరు పేరు భైరవకోన’ సినిమాలో కోర్ పాయింట్ కూడా ఆసక్తికరంగా ఉండి ప్రేక్షకులను అలరించింది. ‘ఊరు పేరు భైరవకోన’ అంటూ వచ్చిన ఈ ఎమోషనల్ హారర్ అండ్ రివేంజ్ డ్రామాలో కొన్ని ఎమోషనల్ సీన్స్ – కొన్ని హారర్ ఎలిమెంట్స్ బాగున్నాయి. ఐతే, కథనం స్లోగా సాగడం, కొన్ని కీలక కీలక సన్నివేశాల్లో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ మిస్ అవ్వడం వంటి అంశాలు సినిమాకి మైనస్ పాయింట్స్ గా నిలిచాయి. ఊరు పేరు భైరవకోన కథాపరంగా లోపాలు ఉన్నప్పటికీ.. టెక్నికల్‌గా బ్రిల్లియెంట్‌గా కనిపిస్తుంది. గ్రాఫిక్ వర్క్, డిఫరెంట్ వరల్డ్‌లో క్రియేట్ చేసిన ఎన్విరాన్మెంట్ సినిమాను మరింత రిచ్‌గా చేసింది. రాజ్ తోట సినిమాటోగ్రఫి ఈ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్. సన్నివేశాలు చాలా రిచ్‌గా మంచి ఫీల్ క్రియేట్ చేసేలా చిత్రీకరించారు. ఈ సినిమాకు మరో ప్లస్ పాయింట్ శేఖర్ చంద్ర మ్యూజిక్. పాటలు ట్రెండ్ సెట్ చేశాయనే తెలిసిందే. బ్యాక్ గ్రౌండ్ స్కోరు చాలా సీన్లను బాగా ఎలివేట్ చేసింది. బ్యానర్‌కు తగిన విధంగా నిర్మాణ విలువలు హై స్టాండర్డ్స్‌లో ఉన్నాయి. కథపై మరికొంత దృష్టిపెట్టి ఉంటే డెఫినెట్‌గా ఫాంటసీ జోనర్లో ట్రెండ్ సెట్ చేసే సినిమా అయి ఉండేదనిపిస్తుంది. ఓ ఫాంటసీ లోకంలో లవ్, తండ్రి కూతుళ్ల ఎమోషన్స్‌తో సాగిన మిస్టీరియస్ థ్రిల్లర్ ఊరు పేరు భైరవకోన. సాంకేతిక అంశాలు ఈ సినిమాకు ప్లస్ పాయింట్. సినిమా చూస్తున్న సేపు కొత్త ప్రపంచంలో ఉన్నట్టు అనిపిస్తుంది. మంచి అంశాల మధ్య మూవీకి ఆడియెన్స్‌ను కనెక్ట్ చేసే కథ లేకపోవడం నిరాశను కలిగిస్తుంది. డిఫరెంట్ జోనర్స్ సినిమాలను ఇష్టపడే వారికి ఈ సినిమా నచ్చడానికి చాలా అంశాలు ఉన్నాయి.
నటీనటులు విషయానికి వస్తే.. డిఫరెంట్ కథలను, కాన్సెప్ట్‌లను ఎంచుకొంటూ సినిమా పట్ల తన అభిరుచిని చాటుకొనే సందీప్ కిషన్ మరోసారి మంచి పాత్రతో ఆకట్టుకొన్నాడు. రెగ్యులర్, రొటీన్‌గా కాకుండా డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్‌తో క్యారెక్టర్‌కు తగిన యాటిట్యూడ్‌తో మెప్పించారనే చెప్పాలి. హీరోగా నటించిన సందీప్ కిషన్ తన పాత్రకు తగ్గట్లు నటించి అందరి మెప్పును పొందారు. హీరోయిన్ వర్ష బొల్లమ్మ తన సహజమైన నటనతో ఆకట్టుకుంది. అలాగే, మరో కీలక పాత్రలో నటించిన కావ్య థాపర్ కూడా చక్కటి నటన కనబరిచింది. స్నేహితుడి పాత్రలో వైవా హర్ష నటన ఓకే అనిపించేలా సాగింది. ఇక వెన్నెల కిషోర్, పి. రవిశంకర్ లతో పాటు మిగిలిన నటీనటులు కూడా తమ త పాత్రల పరిధి మేరకు నటించి ప్రేక్షలకును విశేషంగా ఆకట్టుకున్నారు. ఇక సెకండాఫ్‌లో కంటెంట్‌లో ఎమోషన్స్ జోడించిన తీరు బాగుంది. బసవ, భూమి మధ్య ఉండే ట్విస్టుతో థ్రిల్లింగ్ క్రియేట్ చేశాడు. కానీ ఆ ట్విస్ట్ రివీల్ తర్వాత ఆ పాయింట్ అంతా ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోవడం, భావోద్వేగానికి గురిచేసేలా లేకపోవడం కొంత నిరాశకు గురిచేస్తుంది. కొన్ని మంచి మూమెంట్స్ మధ్య సినిమా అర్ధాంతరంగా ముగించారా? అనే ఫీలింగ్ కలుగుతుంది. ఓవరాల్‌గా ఒక డిఫరెంట్ వరల్డ్‌లో కొంత ఎక్సైట్మెంట్ను క్రియేట్ చేయడంలో దర్శకుడు వీఐ ఆనంద్ తన సత్తాను మరోసారి చాటుకొన్నాడు. భూమిగా వర్ష బొల్లమ్మకు తనకు తాను కొత్తగా రుజువు చేసుకొనే పాత్రలో ఒదిగిపోయింది. గెస్ట్ పాత్రకు కొద్దిగా ఎక్కువగా ఉండే రోల్లో సినిమాను ఇంపాక్ట్ చేశారని చెప్పవచ్చు. క్యూట్‌గా ఎమోషనల్ పాత్రలో వర్ష ఆకట్టుకొన్నారు. కావ్య థాపర్ గ్లామర్ పంట పడించింది. స్క్రీన్‌లో నిండుగా కనిపించి ప్రేక్షకులకు అందాల విందు పంచే పనిని సక్రమంగా చేసింది. వెన్నెల కిషోర్, హర్ష ఎప్పటిలానే వినోదాన్ని తమదైన శైలిలో పంచారు. రవిశంకర్ భావోద్వేగమైన పాత్రలో కనిపించారు. మిగితా వారందరూ తమ పాత్రల పరిధి మేరకు ఒకే అనిపించారు.
సాంకేతిక విభాగం : “ఊరు పేరు భైరవకోన”లో చెప్పాలనుకున్న ఎమోషనల్ కంటెంట్ బాగున్నా.. కథనం ఆసక్తికరమైన ప్లోతో సాగలేదు. ఇక సంగీత దర్శకుడు శేఖర్ చంద్ర సమకూర్చిన పాటలు ఓకే అనిపిస్తాయి. సినిమాటోగ్రఫీ విషయానికి వస్తే.. లొకేషన్స్ అన్ని న్యాచురల్ విజువల్స్ తో ఆకట్టుకున్నాయి. కెమెరామెన్ రాజ్ తోట సీన్స్ ను తెరకెక్కించిన విధానం బాగుంది. ఛోటా కె ప్రసాద్ ఎడిటింగ్ కూడాఫర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగానే ఉన్నాయి. మొత్తం మీద ఈ సినిమా ఓ వర్గం ప్రేక్షకులకు మాత్రమే ఆకట్టుకుంటుంది.