ఎన్నికలు సమీపిస్తున్న వేళ చంద్రబాబుకు అంతర్గత సమస్యలు అప్పుడే మొదలైపోయాయి. నియోజకవర్గాల్లో ఇన్ ఛార్జ్ లను అలా ప్రకటిస్తున్నారో లేదో ఇలా అసమ్మతులు స్వరం పెంచుతున్నారు. తన అసంతృప్తిని బహిరంగంగానే వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా మోస్ట్ సీనియర్ పొలిటీషియన్, పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుపై యువనేత కోడెల శివారం తాడోపేడో తేల్చుకోవడానికి సిద్ధపడటం గమనార్హం.
అవును… సత్తెనపల్లి టిక్కెట్ విషయంలో చంద్రబాబునాయుడితో అమీతుమీకి కోడెల శివరాం సిద్ధమయ్యారని తెలుస్తుంది. తన తండ్రి దివంగత కోడెల శివప్రసాద్ రావు ప్రాతినిథ్యం వహించిన సత్తెనపల్లి నియోజకవర్గ టికెట్ ను చంద్రబాబు తనకే ఇస్తారని శివరాం ఎన్నో ఆశలు పెట్టుకున్నారట. అయితే కోడెల శివరాంపై చంద్రబాబుకు సధాభిప్రాయం లేదని తెలుస్తుంది. దీంతో… సత్తెనపల్లి స్థానానికి ఇన్ ఛార్జ్ గా బీజేపీ నుంచి వచ్చిన కన్నా లక్ష్మీనారాయణను నియమించారు బాబు.
దీన్ని కోడెల శివరాం జీర్ణించుకోలేకపోతున్నారు. నాలుగేళ్లుగా అడుగుతున్నా చంద్రబాబునాయుడు కనీసం అపాయింట్ ఇవ్వలేని, కోడెల మరణించిన తర్వాత బాబు ఆ కుటుంబంపై చూపిస్తున్న గౌరవం ఇదని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో ఏ నాయకుడికి వ్యతిరేకంగా కోడెల పోరాడారో, ఏ నాయకుడితో పోరాడి సత్తెనపల్లిలో టీడీపీ జెండా కాపాడారో… ఇప్పుడే అదే వ్యక్తికి తన తండ్రి సీటు ఇవ్వడం ఏంటని శివరాం నిలదీస్తున్నారు.
ఈ నేపథ్యంలో తన అసంతృప్తిని బహిరంగంగా వ్యక్తపరుస్తున్న కోడెల శివరాం… తాజాగా మరింత డోస్ పెంచినట్లు కనిపిస్తున్నారు. ఇందులో భాగంగా పరోక్షంగా చంద్రబాబుపైనా.. ప్రత్యక్షంగా కన్నా లక్ష్మీనారాయణపైనా కోడెల శివరాం ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా… తనను ఒంటరివాడిని చేసి చుట్టుముట్టి ఎన్నో కుట్రలకు పాల్పడుతున్నారని విమర్శించారు.
అనంతరం… పదవులు, అధికారం కోసం పార్టీలు మారే కుటుంబం తమది కాదని చెప్పిన శివరాం… శివప్రసాద్ స్థానంలో మరొకరిని తీసుకొచ్చి, వారి వెంట నడవాలని తనకు సూచించారని అన్నారు. ఈ సందర్భంగా… పల్నాటి పులి కోడెలతో నడిచిన తాను పిల్లుల పక్కన నడిచేది లేదంటూ సంచలన వ్యాఖ్య చేశారు. దీంతో దీంతో టీడీపీ అధినేత చంద్రబాబు ఆదేశాల్ని తాను పాటించేది లేదని తేల్చిచెప్పినట్లయ్యిందనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
ప్రస్తుతం టీడీపీలో ఈ వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. గెలుపు అనివార్యం.. కనీసం మనుగడ ప్రశ్నార్ధకం చేసుకోకుండా చూసుకోవడం అతిముఖ్యం అని భావిస్తున్న తరుణంలో.. ఇలా అసంతృప్తులు తెరపైకి వస్తే పార్టీకి మరింత నష్టమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే కోడెల శివరాం చేసిన ఈ వ్యాఖ్యలపై చంద్రబాబు కారాలూ మిరియాలూ నూరుతున్నట్లు తెలుస్తుంది. ఇందులో భాంగంగా అవసరమైతే కోడెల శివరాం ని పార్టీ నుంచి తప్పించే ఆలోచన చేయబోతున్నారని తెలుస్తుంది.
శివరాం విషయంలో అయినా సీరియస్ గా స్పందించకపోతే పార్టీలో అసంతృప్తులకు మరింత ధైర్యం ఇచ్చినట్లు అవుతుందని బాబు భావిస్తున్నారని తెలుస్తుంది. దీంతో… శివరాం ను పార్టీ నుంచి సస్పెండ్ చేసి మిగిలిన అసంతృప్తులకు బలమైన సందేశం పంపాలని బాబు భావిస్తున్నారని సమాచారం. అలాకానిపక్షంలో తనను అసమర్ధుడు అని ప్రజలు భావించే ప్రమాధం ఉందనే ఆందోళన కూడా బాబు తన సన్నిహితుల వద్ద వ్యక్తపరుస్తున్నారని తెలుస్తుంది.