‘మాట’ మంత్రశక్తి ఆయనకు బాగా తెలుసు

(లక్ష్మణ్ విజయ్ కొలనుపాక)

 

 

కరుణానిధి కలం యోధుడు. కలం ఆయన శతఘ్ని.  మాట  ఆయన నోట వెలువడినా, కలం నుంచి జాలువారినా అది నిప్పులు చిమ్ముుంటూ దూసుకుపోతుంది.  

దక్షిణాదిన సినిమాలనుంచి రాజకీయాల్లోకి మహానటులు రావడం కొత్త కాదు. అణ్ణాదురై, ఎంజి ఆర్, కరుణానిధి, ఎన్టీరామారావు, జయలలిత… ఇలా ఎందరి పేర్లో చెప్పవచ్చు అయితే, వీళ్లకి కళైంజర్ కరుణానిధికి ఒక తేడా ఉంది. వాళ్లంతా తెరమీదినుంచి ప్రేక్షకలోకాన్నితమ వైపు తిప్పుకున్నవారు. కరుణానిధి కనిపించకుండా, వినిపించి మాటల వశీకరణ విద్య ప్రయోగించి, మొత్తం  హృదయాలను వశపర్చుకున్నారు.

మొకానికి రంగు లేకుండా కలంతో ప్రజలను తనవైపు తిప్పుకుని రాజకీయాలను శాసించిన నాయకుడు కరుణానిధి.సినిమా స్క్రిప్టుల్లోనే కాదు, రాజకీయాల్లో కూడ ఆయన  ప్రయోగించిన అస్త్రాలు మాటలే…

నిజానికి ఎన్టీరామారావుకి,కరుణానిధికి ఈ విషయంలో చాలా పోలిక ఉంది. ఇద్దరు  మంచి స్నేహితులే. రాజకీయాల్లో కరుణ తీరు నుంచి ఎన్టీయార్ బాగా స్ఫూర్తి పొందారు. కరుణానిధికి తమిళ ఆత్మగౌరవం రాజకీయనినాదమయితే, ఆ స్ఫూర్తితీసుకున్న ఎన్టీరామరావు కూడా తెలుగు ఆత్మగౌరవం శతఘ్ని పేల్చారు.

కరుణానిధి ఇరవైయేళ్లకే తమిళ సినిమా ఇండస్ట్రీలో సంభాషణల రచయితగా కాలుమోపారు. 1947లో రాజకుమారి సినిమాకు ఆయన డైలాగులు రాశారు.  ఈచిత్రంలో  ఎంజి రామచంద్రన్ ,  మాలతి నటించారు. ఇది సూపర్ హిట్ కావడంతో కరుణానిధిని అవకాశాలు వెదుక్కుంటూ వచ్చాయి. ఆయన తర్వాత చిత్రం అభిమన్యు(1948).తర్వాత వచ్చిన  మంత్రికుమారి, మారుదనాట్టు ఇలవరసి బాక్సాఫీస్ ను బద్దలు కొట్టాయి. ఆయన సేలం లోని మాడ్రన్ ధియోటర్స్ కి స్ర్కిప్ట్ రైటర్ కుదిరాడు. దానికి టిఆర్ సుందరం యజమాని. ఎంజిఆర్, కరుణానిధి, జయలలితలను సినిమారంగానికి పరిచయం చేసిందీయనే.

తన విశ్వసించే  సోషలిస్టు భావాలను, ద్రవిడ తత్వాన్ని ప్రచారం చేసేందుకు ఆయనకు సినిమాలు బాగా ఉపయోగపడ్డాయి. తన నమ్మే సిద్ధాంతం ప్రాతిపదిన స 1952లో ఆయన  పరాశక్తి చిత్రానికి స్క్రిప్ట్ సమకూర్చారు. ఇది అనూహ్యంగా విజయవంతమయింది. కరుణానిధికి ఇండస్ట్రీలో తిరుగులేని స్ర్కిప్టు రైటర్ స్థానాన్ని అందించింది. అంతేకాదు, మరొక తమిళ మహానటుడు శివాజీ గణేషన్ కు ఇది తొలిచిత్రం. పరాశక్తితో ఆయన కూడా సూపర్ హిట్ అయ్యారు. బ్రాహ్మణ వ్యతిరేక సంభాషణలుండటంతో ఈచిత్రం ఎంత విజయవంతమయిందో అంతే వివాదాస్పదమూ అయింది. ఇలాంటి భావజాలంతో ఆయన రాసిన మరొక రెండు స్ర్రిప్టులు పానం (panam),తంగరత్నం (Thangarathnam) తమిళ సమాజంలో సంచలనం సృష్టించాయి. ఈరెండు చిత్రాల ద్వారా ఆయన  అంటరానితనం, వితంతు వివాహాల వంటి సామాజికరుగ్మతలమీద దాడి చేశారు. తిరుంబిపార్, మనోహర, పానం, మాలై కల్లన్, రంగూన్ రాధ, పుతైయ్యాల్, కంచి తలైవన్, పూమ్ పుహార్ లు తమిళ చిత్రరంగంలో మేటి చిత్రాలుగా నిలిచిపోయాయి. ఎపుడు రిలీజైనీ ఈ చిత్రాలను ప్రజలు ఆదరిస్తున్నారు.

2006-11 మధ్య కాలం తమిళచిత్ర సీమలో ఆయన చివరిఘట్టం. ఉలియన్ ఓసై, పెన్ సింగమ్ లకు ఆయన స్క్రిప్టు సమకూర్చారు. ఇందులో మొదటి దానికి బెస్ట్ డైలాగ్ రైటర్ అవార్డు వచ్చింది.

మొత్తంగా కరుణానిధి 75 చిత్రాలకు స్క్రిప్టు సమకూర్చారు. ఆయన చివరి చిత్రం ప్రశాంత్ తీసిన ‘పొన్నార్ శంకర్’. అది 2011 లో రిలీజయింది. ఆయనకొన్ని నాటకాలు కూడా రాశారున అందులో ముఖ్యమయినవి మణిమకుటం,కాగితప్పూలు,అవన పిట్టాన. ఆయన స్ర్కిప్టు సమకూర్చిన చిత్రాల జాబితా ఇది.

 

Ponnar Shankar (2011)

Ilaignan (2011)

Pen Singam (2010)

Uliyin Osai (2008)

Pasa Kiligal (2006)

Kannamma (2005)

Mannin Maindhan (2005)

Puthiya Parasakthi (1996)

Madurai Meenakshi (1993)

Kavalukku Kettikaran (1990)

Nyaya Tharasu (1989)

Paasa Paravaigal (1988)

Paadatha Thenikkal (1988)

Neethikku Thandanai (1987)

Palaivana Rojakkal (1985)

Kaalam Pathil Sollum (1980)

Pillaiyo Pillai (1972)

Avan Pithana? (1966)

Poomalai (1965)

Poompuhar (1964)

Kaanchi Thalaivan (1963)

Iruvar Ullam (1963)

Thayilla Pillai (1961)

Arasilangkumari (1961)

Kuravanji (1960)

Pudhumai Pithan (1957)

Pudhaiyal (1957)

Raja Rani (1956)

Rangoon Radha (1956)

Malaikkallan (1954)

Thirumbi Paar (1953)

Panam (1952)

Manohara (1952)

Manamagal (1952)

Parasakthi (1952)

Manthiri Kumari (1950)

Marudhanaattu Ilavarasi (1950)

Abimanyu (1948)

Rajakumaari (1947)