తండ్రిపై అల్లు శిరీష్ గుస్సా.!

తనను అస్సలు పట్టించుకోవడంలేదని తండ్రి అల్లు అరవింద్‌పై అల్లు శిరీష్ గుస్సా అవుతున్నాడట. ఎంత చేసినా అల్లు శిరీష్ హీరోగా సెటిల్ కాలేకపోతున్నాడు. ప్రముఖ నిర్మాత అయిన అల్లు అరవింద్ తలచుకుంటే, అల్లు శిరీష్‌ కోసం అసలు సిసలు సినిమా ఒకటి ఏరి కోరి తీసుకురాలేడా.? అంతేగా మరి.

అదే శిరీష్ కోపానికి కారణమట. ఈ తరహా గాసిప్స్ గతంలో కూడా వచ్చాయి. ఇప్పుడవి మరింతగా పెరిగాయి. గీతా ఆర్ట్స్ బ్యానర్‌లో ఓ మంచి సినిమా చేయొచ్చుగా.. అని శిరీష్ తెగ మారాం చేస్తున్నాడట. ఆ మారాం కాస్తా పెద్ద పెద్ద గొడవల వరకూ వెళ్లిందని ఇన్‌సైడ్ సోర్సెస్ ద్వారా అందుతోన్న సమాచారం.

నిజంగానే అల్లు శిరీష్ ఇలా చేస్తున్నాడా.? లేదంటే, నిప్పు లేకుండానే పొగ వస్తోందా.? ఏమో తెలీదు కానీ, చాలా కాలంగా అల్లు శిరీష్ ఇంటి నుంచీ, తన తండ్రి నుంచీ దూరంగా వుంటున్నాడన్న వార్తలు కూడా ఆ మధ్య వినిపించాయ్. అయితే, మొన్నామధ్య అల్లు శిరీష్ నటించిన ‘ఊర్వశివో రాక్షసివో’ సినిమాని బలవంతంగా ఆడించి, హిట్టు కాని హిట్టు అనిపించడానికి అల్లు అరవింద్ పడిన కష్టం, తాపత్రయం అంతా ఇంతా కాదు మరి