ఏపీలో జూన్ 16, 17 తేదీల్లో అసెంబ్లీ సమావేశాలు జరనగున్న సంగతి తెలిసిందే. అయితే ఏపీలో టీడీపీ నేతలపై కొనసాగుతున్న అరెస్ట్ లు…ఇతర కారణాలు గా టీడీపీ ఎమ్మెల్యేలు సమావేశాలకు వెళ్లాలా? వద్ద అన్నదానిపై కొద్ది రోజులుగా సస్సెన్స్ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు నేతృత్వంలోని సోమవారం సమావేశమైన టీడీఎల్పీ కీలక నిర్ణయం తీసుకుంది. ఎట్టి పరిస్థితుల్లో అసెంబ్లీ సమావేశాలకు అందరూ హాజరు కావాలని నిర్ణయించారు. రాష్ట్రంలో కక్ష సాధింపు రాజకీయాలకు వైసీపీ నేతలు పాల్పడుతున్నారని ఆరోపించిన తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించాలని భావిస్తున్నట్లుగా కథనాలు వచ్చాయి.
ఈ నేపథ్యంలో టీడీపీ సమావేశాలకు హాజరవుతుందా? లేదా? అని చాలా సందేహాలు వ్యక్తం అయ్యాయి. అయితే వెళ్లకపోతే అసెంబ్లీలో ఏదైనా జరిగే అవకాశం ఉందని భావించిన టీడీఎల్పీ వెళ్లాలనే నిర్ణయించింది. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే చర్చలో అక్రమ అరెస్ట్ లు, ఇసుక మాఫియా, మధ్యం ధరలు, విశాఖ ఎల్ జీ పాలిమర్స్ ఘటనపై ప్రభుత్వాన్ని నిలదీయాల ని టీడీపీ నేతలు నిర్ణయించారు. అలాగే తమ పార్టీ నేతల అరెస్ట్ పై గవర్నర్ కు వినతిపత్రం సమర్పించనున్నారు. తొలి రోజు సమావేశాల నుంచే రాష్ర్టంలో పరిస్థితిపై పెద్ద ఎత్తున అంసెబ్లీలో గళం వినిపించాలని టీడీపీ వ్యూహ వేసింది.
అయితే అంతే ధీటుగా వైకాపా ప్రతివ్యూహాలతో ముందుకెళ్లుందని పార్టీ వర్గాల నుంచి తెలిసింది. అలాగే టీడీపీ నేతలు అరెస్ట్ కు నిరసగానే రెండు రోజుల సమావేశాలకు ఎమ్మెల్యేలు అంతా నల్ల చొక్కాలతో సమావేశాలకు హాజరు కావాలని నిర్ణయించారు. అయితే సమావేశాలకు హాజరు కావడం పట్ల టీడీపీ నేతల్లోనే కొందరు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అసెంబ్లీకు వెళ్లకుండా వాకౌట్ చేస్తేనే మంచిదని భావిస్తున్నారు. అయితే చంద్రబాబు మైండ్ లో ఆఆలోచన కూడా ఉందని అంటున్నారు. అక్కడ పరిస్థితులను బట్టి చంద్రబాబు వాకౌట్ నిర్ణయాలు ఉంటాయని తెలుస్తోంది.