సీఎం చీర మాయం కేసులో ఆలయ ఈవోపై వేటు

తెలంగాణ సీఎం కేసీఆర్ వరంగల్ భద్రకాళీ అమ్మవారికి,కాళేశ్వరంలో ముక్తిశ్వర ఆలయంలో  సమర్పించిన చీరల మాయం కేసులో ఆలయ ఈవోల పై సస్పెన్షన్ వేటు పడింది. తెలంగాణ వస్తే భద్రకాళీ అమ్మవారికి చీర సమర్పిస్తానని కేసీఆర్ మొక్కుకున్నారు. తెలంగాణ రాష్ట్రం రావడంతో మొక్కుకున్నట్టుగానే వరంగల్ భద్రకాళీ అమ్మవారికి సీఎం కేసీఆర్ కుటుంబసమేతంగా హాజరయ్యి అమ్మవారికి పట్టు చీర సమర్పించారు. ఆ చీరను భద్రంగా దాచవలసిన  అధికారుల నిర్లక్ష్యంతో ఆ చీర మాయమైంది. అది అధికారులు తీశారా లేక ఆలయ పాలకమండలి చైర్మన్ లేదా సభ్యులు ఎవరైనా దానిని తీశారా అనే అనుమానాలు తలెత్తాయి. కాళేశ్వరంలో కూడా మాయమైన చీరలపై బాధ్యులను చేస్తూ ఈవోలు హరిప్రకాశ్, శ్రీనివాస్ లపై ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది.

కొత్త ధర్మకర్తల మండలి వచ్చి ఆ చీర గురించి ఆరా తీయగా అధికారులు నీళ్ళు నమిలారు. దాని స్థానంలో రెండు వేల రూపాయల చీర తీసుకొచ్చి పెట్టారు. ఈ విషయం ఆ నోటా ఈ నోటా పాకి బయటపడింది. సోషల్ మీడియా, మీడియా లో ఈ న్యూస్ హాట్ టాపిక్ కావడంతో ప్రభుత్వం దీనిని సీరియస్ గా తీసుకుంది. విచారణకు ఆదేశించడంతో దానికి బాధ్యులుగా చేస్తూ ఆలయ ఈవోలపై వేటు వేసింది. ఇంతకీ ఆ చీరలు ఎక్కడ ఉన్నాయనేది మిస్టరీగానే మిగిలింది.

సీఎం అమ్మవారికి సమర్పించిన పచ్చని పట్టుచీర