ఏపీలో అకాలవర్షాలతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. చేతికొచ్చిన పంట నష్టపోయి ఆవేదన చెందుతున్నారు. అనంతరం అకాల వర్షాలకు దెబ్బతిన్న పంట పొలాలను, ధాన్యం సేకరణ విధానాన్ని… పౌరసరఫరాల శాఖామంత్రి కారుమూరి నాగేశ్వరరావు, ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ, అధికారులతో కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి రైతులను కలిసి పరిశీలించారు. సీజన్ ముగిసేలోపే పరిహారం అందిస్తామని చెప్పుకొచ్చారు.
ఇదే క్రమంలో… టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ లు గోదావరి జిల్లాల్లో పర్యటించి రైతులతో మాట్లాడారు. రైతులకు అండగా నిలవాలని ప్రభుత్వానికి అల్టిమేటం జారీచేశారు. ఈ సందర్భంగా… మైకందుకున్న చంద్రబాబు… ప్రభుత్వంపై విరుచుకు పడ్డారు. జగన్ సర్కార్ బాధ్యతా రాహిత్యంగా నడుచుకుంటుందని.. వర్షాలు పడి రెండు వారాలు దాటుతున్నా ఇంకా పరిహారం ఇవ్వలేదని దుబ్బయట్టారు.
రైతులను పట్టించుకోకపోతే మట్టికొట్టుకుపోతారని జగన్ సర్కార్ ని చంద్రబాబు హెచ్చరించారు. రైతులను నిర్లక్ష్యం చేసిన ప్రభుత్వాలు కాలగర్భంలో కలిసిపోతాయని వార్నింగ్ ఇచ్చారు. రైతులకు తన ప్రభుత్వంలో ఎన్నో చేశామని.. రైతులకు కష్టం వస్తే ఎంతో వేగంగా స్పందించేవాళ్లని తెలియజేశారు. దీంతో… పాతలెక్కలు తీయడం మొదలుపెట్టారు వైసీపీ నేతలు. అందులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి రావడంతో… ఆ విషయంలో బాబు సూపర్ అంటున్నారు రైతులు!
విభజిత ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు… 2014–15 లో కర్నూలు జిల్లాలో అక్టోబర్, డిసెంబర్ మాసాల్లో వర్షాలు వస్తే.. 2016 జూలైలో అంటే.. దాదాపుగా రెండేళ్ల తర్వాత రైతులకు పంట నష్టపరిహారం అందించారు.
అదేవిధంగా 2014లోనే కర్నూలు జిల్లాలో కరువు వచ్చినప్పుడు దానికి సంబంధించిన కరువుభృతిని 2017లో అందించారు.
ఆ తర్వాత 2015 ఏప్రిల్ మాసంలో అకాలవర్షాలు కురిస్తే.. ఏడాది తర్వాత అంటే, ఆగస్టు 2016లో పంటనష్టపరిహారాన్ని ఇచ్చారు.
2015లో కరువు వస్తే నవంబర్ 2016లో పరిహారం అందించారు.
సబ్సిడీ సీడ్స్ కు సంబంధించి రూ.282 కోట్లు రైతులకు బకాయిలు పెట్టారు.
సున్నావడ్డీ పంటరుణాలకు సంబంధించి రైతులకు రూ.1180 కోట్లు బకాయిలు మాఫీ చేయలేదు.
రైతులు పంటలు నష్టపోయినప్పుడు బీమా కింద చెల్లించాల్సిన రూ.780 కోట్లు చెల్లించలేదు.
ఆఖరికి ఆత్మహత్యలు చేసుకున్న 474 రైతు కుటుంబాలకు అందజేయాల్సిన రూ.23.70 కోట్లు సైతం ఇవ్వలేకపోయారు! అని తేలిందంట!
దీంతో… ముక్కున వేలేసుకుంటున్న ఏపీ జనాలు… అధికారంలో ఉంటే అలా ప్రవర్తించి.. ఇప్పుడు పదవి పోయేసరికి ఇలా ఎక్కడలేని ప్రేమ రైతులపై కురిపిస్తున్నారా అని ఆశ్చర్యపోతున్నారంట. చింతచచ్చినా పులుపు చావలేదన్నట్లుగా… ఇంతవయసొచ్చి, గత ఎన్నికల్లో ఇంత దెబ్బ తగిలినా… అమాయకులైన రైతులను ఇంకా మోసం చేస్తున్నారా అని ప్రశ్నిస్తున్నారంట! ఫలితంగా… ఏడ్వలేక నవ్వుతున్న రైతులు… ఇలాంటి వ్యవహారాల్లో చంద్రబాబు సూపర్ ఫెర్మార్మెన్స్ ఇస్తుంటారని నిట్టురుస్తున్నారంట!