‘ఆర్ఆర్ఆర్’ కోసం రామ్ చరణ్, ఎన్టీయార్ కలిసి నటించినప్పుడు.. మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలయ్య కలిసి నటిస్తే వింతేముంది.?
మంచి కథ దొరికితే, బాలయ్యతో కలిసి నటించడానికి తాను సిద్ధమే అని చాలా సార్లు చిరంజీవి చెప్పారు. అలాగే, బాలయ్య కూడా..
చిరంజీవితో కలిసి నటించడానికి తనకెలాంటి అభ్యంతరాల్లేవనీ బాలయ్య కూడా గతంలో పలుమార్లు వెల్లడించారు.
అంతేకదా.. జూనియర్లు కలిసి నటించినప్పుడు సీనియర్లు ఎందుకు కలిసి నటించకూడదు.! పైగా ఈ కాంబినేషన్ అదో సంచలనమే అవుతుంది కూడా.
అంతేకాదు, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ కూడా ఈ కాంబినేషన్ కోసం తెర వెనక గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నాడనీ తెలుస్తోంది. మరో ప్రముఖ నిర్మాణ సంస్థతో కలిసి అల్లు అరవింద్ ఈ ప్రాజెక్ట్ టేకప్ చేయబోతున్నారనీ అంటున్నారు.
అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, తెర వెనక కథా చర్చలు గట్టిగానే జరుగుతున్నాయట.
యువ దర్శకుల టీమ్ ఒకటి కథపై సీరియస్గా వర్క్ చేస్తున్నారనీ తెలుస్తోంది. వర్కవుట్ అయితే, డైరెక్టర్ ఎవరన్నది ఫైనల్ చేస్తారట.
అన్నీ సెట్ అయితే, వచ్చే ఏడాది ఈ ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ వుండొచ్చని తెలుస్తోంది. చూడాలి మరి.