Ambanti Rambabu: వైకాపా మాజీ మంత్రి అంబటి రాంబాబు నిత్యం సోషల్ మీడియా వేదికగా అలాగే మీడియా సమావేశాలలో అధికార ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉంటారు. ఇకపోతే ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైకాపా కార్యకర్తలు నాయకులపై పెద్ద ఎత్తున కేసులు పెడుతూ అరెస్టులు చేస్తున్న సంగతి మనకు తెలిసిందే సోషల్ మీడియా వేదికగా కూటమి నేతల గురించి మహిళల గురించి అసభ్యకరంగా మాట్లాడిన వారిపై అరెస్టులు చేస్తున్నారు.
ఈ క్రమంలోనే అంబంటి రాంబాబు సైతం విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. నారా లోకేష్ గతంలో వైయస్ జగన్మోహన్ రెడ్డిని అలాగే ఆయన కుటుంబ సభ్యులను ఉద్దేశిస్తూ మాట్లాడినటువంటి వ్యాఖ్యలను అలాగే ఆయన సోషల్ మీడియా వేదికగా చేసిన ట్వీట్లను పోలీసులకు సమర్పిస్తూ ఆయనపై కేసు నమోదు చేయాలి అంటూ కోరారు. ఇప్పటివరకు పోలీసుల విధమైనటువంటి చర్యలు తీసుకొని నేపథ్యంలో అంబటి రాంబాబు ఇదే విషయంపై పోలీస్ శాఖను ప్రశ్నించారు.
ఈ సందర్భంగా ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ పోలీస్ శాఖ నారా లోకేష్ పై ఎందుకు చర్యలు తీసుకోలేదు అంటూ ప్రశ్నించారు. ఏపీలో అరాచక పాలన నడుస్తుందని హోం మంత్రి అనిత తీరును రాంబాబు తప్పు పట్టారు. హోం మంత్రిపై అణిచిత వ్యాఖ్యలు చేశారని వైకాపా కార్యకర్తలను ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి ఇబ్బందులకు గురి చేస్తున్నారని తెలిపారు. అసలు హోం మంత్రి అనిత గారి కులం ఏంటో కూడా మాకు తెలియదని తెలిపారు.
ఆమె ఎక్కడికి వెళ్లినా బైబిల్ చేత పట్టుకుని వెళ్తానని తన కారులో కూడా బైబిల్ ఉంటుందని మాత్రమే తెలిపినట్లు వెల్లడించారు. ఇక మా పార్టీ కార్యకర్తలపై కేసులు పెట్టేసరికి ఆమె ఎస్సీ గా మారిపోయారని రాంబాబు విమర్శించారు. పాపం ఆయన ఆమె చేతిలో ఏముందిలే అంతా కూడా నారా లోకేష్ మహిమ అంటూ ఈ సందర్భంగా అంబంటి రాంబాబు ప్రభుత్వ తీరు పట్ల అలాగే హోమ్ మినిస్టర్ అనిత పట్ల చేసిన ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.